Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

పొంగులేటి పోటీ ఎక్కడ నుంచి ఖమ్మం మా …? కొత్తగూడెం మా …??

పొంగులేటి పోటీ ఎక్కడ నుంచి ఖమ్మం మా …? కొత్తగూడెం మా …??
ఎట్టకేలకు చేరికపై స్పష్టత నిచ్చిన పొంగులేటి
కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు
కాంగ్రెస్ నాయకులతో వరస మీటింగులతో బిజీ ,బిజీ
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తో నిత్యసంబందాలు
రాష్ట్రంలో పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్న కనుగోలు టీం

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఆయన నూటికి 200 శాతం కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. దీన్ని ఆయన కూడ నిర్దారించారువచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు …? ఆయనకు ఎన్ని సీట్లు ఇస్తారు ..?ఆయన వెంట వచ్చిన వారిని సంతృప్తి పరుస్తారా ..లేదా …? అనే సందేహాలకు కూడ మరి కొద్దీ రోజుల్లో తెరపడనుంది .. పొంగులేటి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ..? ఖమ్మమా …? లేక కొత్తగూడం మా అనేది ఇప్పడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన కోరిక ఏమైనా చివరకు అధిష్టానం ఫైనల్ చేస్తుందని సమాచారంఉమ్మడి జిల్లా కేంద్రమైన ఖమ్మం లోనే పోటీ చేస్తే బాగుంటుందని అనేక మంది హితులు ,సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారు . పార్టీ కూడ అదే ఆలోచనలు ఉన్నట్లు సమాచారంరాహుల్ ఈనెల 21 అమెరికా పర్యటన నుంచి ఇండియా కు రానున్నారు . 20 నుంచి 25 మధ్యలో రాహుల్ గాంధీ తో మీటింగ్ కు అందుబాటులో ఉండాలని పొంగులేటి సమాచారం వచ్చినట్లు వినికిడిఉమ్మడి జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పెట్టాలనే ఆలోచనలో అధిష్టానం పావులు కదుపుతుంది. జిల్లాకు చెందిన బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారంఇప్పటికే సీటింగ్ లుగా ఉన్న మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి , భద్రాచలం నుంచి పొదెం వీరయ్య సీట్లు కాక మిగతా సీట్ల లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ సీరియస్ కసరత్తు చేస్తుంది

ఇప్పటికే పొంగులేటి అనేక మంది కాంగ్రెస్ పెద్దలను కలిశారు .వారు కూడ పొంగులేటి నిర్ణయాన్ని స్వాగతించారు . రాహుల్ టీం స్వయంగా రంగంలోకి దిగి పొంగులేటి ,జూపల్లిలను పార్టీలోకి ఆహ్వానించింది. తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో అంతకుముందు బీజేపీలో చేరతారంటూ కున్న అనేకమంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారు.

పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ లో చేరికపై మరి కొద్దీ రోజుల్లో మీడియా సమావేశం పెట్టి స్వయంగా ప్రకటిస్తుందని విశ్వసనీయ సమాచారంకొందరు కాంగ్రెస్ నేతలు పొంగులేటి చేరిక పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా కు ఎక్కడం పై కూడ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ బలోపేతానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వరంలో ఆలోచనలు చేస్తుండగా కొందరు అడ్డగోలుగా మాట్లాడంపై పార్టీ నేతలు ద్రుష్టి సారించారు . రాష్ట్రం ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం ..దీనికి అధిష్టానం ముఖ్యనేతలు హాజరు అవుతారని తెలుస్తుంది …..

Related posts

రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు …

Drukpadam

అక్బరుద్దీన్ ఒవైసీని కలవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ!

Drukpadam

బీఆర్ యస్ తో ఐక్యత …పోరాటం మా విధానం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని …

Drukpadam

Leave a Comment