Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒక్కరోజు ముందస్తుకు కూడా వెళ్లం: ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టీకరణ

ఒక్కరోజు ముందస్తుకు కూడా వెళ్లం: ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టీకరణ

  • అమిత్ షాతో భేటీ సందర్భంగా ముందస్తుపై చర్చలు జరిగినట్లుగా ప్రచారం
  • కొట్టి పారేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి 
  • రాష్ట్ర అభివృద్ధి, నిధుల కోసమే జగన్ కేంద్ర పెద్దలతో చర్చించారన్న మిథున్ 

తమకు ముందస్తు ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముందస్తు గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఒక్కరోజు కూడా తాము ముందస్తుకు వెళ్లేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, నిధులకోసమే సీఎం జగన్ కేంద్ర పెద్దలతో చర్చించారన్నారు.

జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులతో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా ముందస్తు చర్చకు వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్రం ముందస్తుపై ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో తమకు దగ్గరగా ఉన్న పార్టీలతో ఈ అంశాలపై చర్చలు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా జగన్ తోను ఏపీలో ముందస్తుపై చర్చలు జరిపి ఉంటుందనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు.

Related posts

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నాం: అచ్చెన్నాయుడు

Drukpadam

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

ఆలయ ప్రారంభోత్సవంలో ప్రధాని …మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడేందుకు నో..!

Drukpadam

Leave a Comment