స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …
– తమాషా రాజకీయాలు మానకపోతే బీఆర్ఎస్ భరతం పడతామని హెచ్చరిక
– అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
– మూడు రంగుల కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడమే మా లక్ష్యం
– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– బీఆర్ఎస్ కు చెందిన వెయ్యిమందికి పైగా యువకులు, 500 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక
–కాంగ్రెస్ నాయకుడిగా అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు
–వివిధ పార్టీలనుంచి కాంగ్రెస్ లోకి ఆకర్షించేందుకు ప్రయత్నం
–ఖమ్మం ,వైరా నియజోకవర్గాల్లో పలువురు చేరిక
ఖమ్మం మాజీఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల రెండవతేదీన ఖమ్మంలో జరిగిన తెలంగాణా జనగర్జన సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు . జిల్లా విస్తృత పర్యటనలు చేపట్టారు .కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తాడు ..ప్రజల్లో క్రేజీ ఉన్న నేతగా పేరు ఉండటం కాంగ్రెస్ పార్టీ కావడంతో ప్రజలు ఆయన పర్యటనలు తండోపతండాలుగా వస్తున్నారు . ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిపిన పర్యటనలో ఖమ్మం నగరం ,కారేపల్లిలలో వివిధ పార్టీలకు చెందిన వారు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చెరకు .ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఆ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. నగరంలోని తుమ్మలగడ్డ ప్రాంతంలో నిర్వహించిన మేము సైతం కార్యక్రమంలో పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ నవాజ్ ఆధ్వర్యంలో 39, 40, 42వ డివిజన్లకు చెందిన సుమారు వెయ్యిమందికి పైగా యువకులు, 500 కుటుంబాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. తొలుత పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి తుమ్మలగడ్డ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పొంగులేటి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తమాషా రాజకీయాలు మానుకోకపోతే భరతం పడతామని ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై అక్రమ కేసులను బనాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే వారిని కాపాడుకునేందుకు తమంతా రోడ్డెకెందుకు సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకునే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని రావణ పాలనకు స్వస్తి పలకడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ మిక్కిలినేని నరేందర్, ముస్తాఫా, అలె సాయి కిరణ్, మహ్మద్ చంటి, ఎస్.కె. అజీం, ఎస్.కె. జావిద్, ఎం. అఫ్సర్ బేగ్, ఎండీ, ఇమ్రాన్, ఎస్.డి. జావిద్, మియాభాయ్, ఇమామ్ భాయ్, కొప్పెర ఉపేందర్, బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కారేపల్లి లో బొర్రా రాజశేఖర్ , గుగులోత్ విజయాబాయి తదితరులు పాల్గొన్నారు …