క్రైమ్ వార్తలు

ఆ సన్నాసులు మొదట ప్రజాసేవ చేయాలి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

ఆ సన్నాసులు మొదట ప్రజాసేవ చేయాలి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

  • కొంతమంది తనపై అవాకులు చవాకులు పేలుతున్నారన్న మంత్రి
  • పదవి ముఖ్యం కాదు.. ఎంత ప్రజాసేవ చేశామనేది ముఖ్యమని వ్యాఖ్య
  • నా గురించి సన్నాసులు తెలియక మాట్లాడుతున్నారని ఆగ్రహం

తనపై కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎన్ని రోజులు పదవిలో ఉన్నామనేది ముఖ్యంకాదని, ఎంత ప్రజాసేవ చేశామనేదే ముఖ్యమన్నారు. కొంతమంది సన్నాసులు తన గురించి తెలియక ఏదో మాట్లాడుతున్నారన్నారు. ఆ సన్నాసులంతా మొదట ప్రజాసేవ చేయాలని సూచించారు.

కాగా, అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. ఆయనో బచ్చా అని విమర్శించారు. తనతో పోటీ చేసే అర్హత ఆ మంత్రికి లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పువ్వాడ తీవ్రంగా స్పందించారు.

Related posts

ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య

Ram Narayana

చిరు వ్యాపారికి వలపు వల.. నగ్నంగా మార్చి లక్షన్నర స్వాహా

Ram Narayana

హుజురాబాద్ లో దొంగల బీభత్సం.. వృద్ధులపై దాడి…

Ram Narayana