Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ పై విజయవాడలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు…

పవన్ కల్యాణ్ పై విజయవాడలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు…

  • వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్
  • మహిళల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న జనసేనాని
  • పవన్ పై కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసిన వాలంటీర్ సురేశ్

వాలంటీర్లపై జనసేన అధినేత చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహిళల అక్రమ రవాణాలకు కొందరు వాలంటీర్లు సహకరిస్తున్నారంటూ పవన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు వారాహి యాత్రలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పవన్ పై సురేశ్ అనే వాలంటీర్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 405 / 2023 కింద సురేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పవన్ పై ఐసీపీ 153, 153 ఏ, 502 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జగన్ పై విమర్శలు…

జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, తాను మాత్రం జగన్ భార్య గురించి ఏనాడూ మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు. చాలాచోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, వాలంటీర్లు అందరూ అలాంటి వారు కాదని, కానీ ఈ వ్యవస్థలోనూ కొందరు కిరాతకులు ఉన్నారని ఆరోపించారు.

తాను ఏనాడూ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని, కానీ జగన్ మద్దతుదారులు తనను నీచంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా వాళ్ళు కూడా మహిళల జోలికి రారని, జనసేన మహిళలను మాత్రం వైసీపీ వారు తిడుతున్నారన్నారు. తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంతో వచ్చానన్నారు. జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన సంస్కారహీనుడు అని మండిపడ్డారు. ‘నువ్వొక సంస్కారహీనుడివి జగన్.. వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు ఏనాడైనా ఆవిడని మేము దూషించామా అని…’ అని పవన్ నిలదీశారు. జగన్ మాదిరిగా తన తండ్రి ముఖ్యమంత్రి కాదన్నారు. 

వాలంటీర్లు తనకు సోదర సమానులని, వారి పొట్టకొట్టాలనేది తన ఉద్దేశం కాదన్నారు. వాలంటీర్లు అందరూ చెడ్డవారు అని తాను చెప్పడం లేదని, ఈ వ్యవస్థ ఎలా పని చేయాలో చెబుతున్నానని అన్నారు. వేతనం ఆశించకుండా పని చేసేవాళ్ళే వాలంటీర్లు, డబ్బులు తీసుకుంటే అలా ఎలా అంటారన్నారు. వాలంటీర్లు కేవలం రూ.5వేలకు పని చేస్తున్నారని, కానీ వారికి రెట్టింతలు ఇవ్వాలని కోరుకునే వాడినన్నారు. మీలాంటి యువత కోసమే నా పోరాటమని చెప్పారు. వాలంటీర్ల జీతం ఏపీలో మద్యం కంటే తక్కువ అని విమర్శించారు.

మద్యపాన నిషేధం చేస్తామని ఏపీలో అధికారంలోకి వచ్చి, రూ.1 లక్ష కోట్లకు పైగా మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. సంపూర్ణ మద్యనిషేధం ఎక్కడా వీలుపడలేదన్నారు. ఏపీ డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఉందని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు రావాలని, జనసేన బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఆడపడుచులు కోరుకునే మద్యనిషేధాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు.

ముస్లింలకు తాను వ్యక్తిగతంగా ఇష్టమని, కానీ తాను బీజేపీ వైపు ఉన్నానని నమ్మడం లేదన్నారు. కానీ జగన్ ముస్లింలకు షాదీ ముబారక్ తీసేశారని ఆరోపించారు. మీ మాతృభాషలో స్కూల్స్ పెట్టలేకపోయారన్నారు. నేను మాత్రం బీజేపీతో ఉన్నానా? లేదా? మీకు అనవసరమని, మీకు న్యాయం చేస్తానా? లేదా? అని చూడండన్నారు.

Related posts

అద్దాల వంతెన ఎంతపని చేసింది

Drukpadam

నెలకు రూ.లక్ష శాలరీ.. మీమ్స్ చేయడం తెలిస్తే చాలు!

Drukpadam

కెనడాలో 700 మంది భారత విద్యార్థుల ఆందోళన…!

Drukpadam

Leave a Comment