ఆంధ్రప్రదేశ్

మహిళా అధికారికి అదే తొలిపోస్టింగ్.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

  • తొలి పోస్టింగ్‌లోనే లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ఝార్ఖండ్ మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • అధికారిణి లంచం తీసుకుంటుండగా తీసిన ఫొటో నెట్టింట వైరల్
  • బాధితుడి ఫిర్యాదుతో పక్కా ప్లాన్ వేసి ఆమెను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ఝార్ఖండ్‌లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల క్రితం మిథాలి శర్మ, కోడర్మ జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. అదే ఆమెకు తొలి పోస్టింగ్. కానీ, డబ్బులపై కక్కర్తితో ఆమె అవినీతి నిరోధక శాఖ అధికారులకు జులై 7న అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా వారు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం, మిథాలీ శర్మ తొలుత కోడర్మా జిల్లాలోని వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడి లావాదేవీలు పరిశీలించగా లెక్కల్లో రూ.20 వేల మేరకు తేడా కనిపించింది. దీంతో, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. అయితే, మిథాలీ డిమాండ్‌పై ఆ సంస్థ సిబ్బంది ఒకరు అవినీతి నిరోధక శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌తో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts

పాస్ పోర్ట్ దరఖాస్తు ​విషయంలో రాహుల్​ గాంధీకి కోర్టులో ఊరట..!

Drukpadam

కొమ్మినేని విడుదలకు సెలవుల బ్రేక్ .. సోమవారం సాయంత్రం బెయిల్‌పై బయటకు?

Ram Narayana

మా అమ్మ ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదు: షేక్ హసీనా తనయుడు

Ram Narayana