తెలంగాణ వార్తలు

ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు…ఎమ్మెల్యే సండ్ర

ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆయిల్ ఫామ్ కి పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ ఈ ఆయిల్ ఫామ్ రికవరీ మీద 13,346 రూపాయలు ప్రభుత్వానికి ఉండాలని నిబంధన పెట్టడం జరిగిందని దాని వలన తెలంగాణకు మాత్రమే కాకుండా యావత్ భారత దేశంలోని ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని దీనిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఉదృతం చేయాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి కమిటీలు తెలంగాణ రాష్ట్రం లేకపోవడం వల్ల టన్నుకి 16,000 నుండి 17,500 వరకు చెల్లిస్తున్నామని ఎలాంటి గొప్ప నిర్ణయం వల్ల మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ , అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేటుగా ఉన్న ఫ్యాక్టరీలు కూడా మన తెలంగాణ రాష్ట్రం ను చూసి అనుసరిస్తున్నాయని తెలిపారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే సత్తుపల్లిలో వేలకోట్ల రూపాయల విలువచేసే భూమిని కూడా రైతులు త్యాగం చేశారని అలాంటి సింగరేణి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వేలం వేసి లాక్కోవడం కరెక్ట్ కాదని ఎప్పటికే పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళన తెలియజేశామని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వేలం ప్రక్రియని ఆపాలని దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఎమ్మెల్యే సండ్ర కోరారు.

Related posts

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు?.. రివాల్వర్ గుట్టు విప్పని ఎస్సై భాను ప్రకాశ్

Ram Narayana

దుబాయ్‌లో యాచకుడిగా తెలంగాణ వాసి.. 13 ఏళ్ల తర్వాత సొంతూరికి!

Ram Narayana

సోషల్ మీడియా వల్ల మహిళలపై వేధింపులు పెరిగాయి: సీఎం రేవంత్ రెడ్డి…

Ram Narayana