ఖమ్మం ఎంపీ నామ కృషి ఫలితం …ఉమ్మడి ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు …
-ఖమ్మం, కొత్తగూడెం, మధిర రైల్వే స్టేషన్లకు రూ.25 కోట్లు చొప్పున మంజూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, కనీస సదుపాయాల కల్పనకు సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు పలు విడతలుగా రాసిన లేఖకు స్పందనగా ,రైల్వే శాఖ నిధులు విడుదల చేసిందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం, మధిర, కొత్తగూడెం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. ఒక్కో రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.25 కోట్లు చొప్పున నిధులు కేటా యించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మిగతా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కూడా ఒక్కో దానికి రూ.10 కోట్లు చొప్పున మంజూరుకు రైల్వే మంత్రి హామీ ఇచ్చారని నామ పేర్కొన్నారు.రైల్వే జెడ్ ఆర్యూసీసీ సభ్యునిగా రెండో సారి భాద్యత లు తీసుకోగానే పలు విడతలుగా రైల్వే మంత్రితో భేటీ అయి, సమస్యలు నివేదించి, లేఖలు అందించానని చెప్పారు.తాను కోరగానే ఖమ్మం జిల్లాలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నామ నాగేశ్వరరావు చెప్పారు.