Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చిరుత దాడిలో బాలిక మృతి నేపథ్యంలో తిరుమల నడక దారిలో హైఅలర్ట్ !

తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ ….
7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతా కట్టు దిట్టం ..
తిరుమల నడకదారిలో విషాదాంతం
చిరుత దాడిలో బాలిక మృతి
కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
నడకదారిలో ప్రతి 100 మంది భక్తులను బృందంగా పంపనున్నట్టు వెల్లడి
ముందు, వెనుక రోప్ లతో రక్షణ
పైలెట్ గా భద్రతా సిబ్బంది నియామకం

తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత అనే బాలికను చిరుతపులి బలిగొనడం అందరినీ కలచివేస్తోంది. ఇటీవలే ఓ బాలుడిపై చిరుత దాడి చేసినా, అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికిబయటపడ్డాడు. కానీ లక్షిత ఉదంతం విషాదాంతం అయింది.

ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. ఈ హై అలర్ట్ జోన్ లో ప్రతి 100 మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది.

Related posts

అమెరికాలో ఎన్నారైని తుపాకీతో కాల్చి చంపిన టీనేజర్లు

Drukpadam

రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29: చంద్రబాబు

Drukpadam

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కు ప్రధాని మోదీ కాంప్లిమెంట్స్ !

Drukpadam

Leave a Comment