Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగాలపై ప్రజల ఆసక్తి…!

పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగాలపై ప్రజల ఆసక్తి…!
రాహుల్ కంటే వెనుకబడ్డ ప్రధాని మోదీ
పార్లమెంటులో రాహుల్ ప్రసంగాలనే ఎక్కువగా చూసిన ప్రజలు
అవిశ్వాసంపై చర్చలో రాహుల్ ప్రసంగాన్ని వీక్షించిన 3.5 లక్షల మంది
యూట్యూబ్ లో ఏకంగా 26 లక్షల మంది వీక్షించిన వైనం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అరుదైన ఘనతను సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ చేసిన ప్రసంగాలనే ప్రజలు ఎక్కువగా చూశారు. ఈ విషయంలో రాహుల్ కంటే ప్రధాని మోదీ వెనుకపడిపోయారు. దీనికి సంబంధించిన గణాంకాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇటీవల కాలంలో రాహుల్ గ్రాఫ్ పెరిగిందని అనేక మాధ్యమాలు తమ సర్వేలలో వెల్లడించాయి. భారత్ జోడో యాత్రతో ఆయన ప్రజలతో మమేకమైయ్యారు . నేరుగా ప్రజలను కలుసుకున్నారు . వారితో ముచ్చటించారు . మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే అక్కడికి వెళ్లారు . ప్రజల భాదలు అక్కడ జరుగుతున్నా అల్లర్ల గురించి స్వయంగా తెలుసుకున్నారు .మోడీ ఇంటిపేరుపై వచ్చిన రాద్ధాంతంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో చర్చనీయాంశంగా మారింది . అంతే కాకుండా ఒక ప్రధాని మునిమనవడు , ఒక ప్రధాని మనవడు ,ఒక ప్రధాని కొడుకుగా ఉన్న రాహుల్ నివాసం ఉంటున్న బంగ్లాను సైతం ఖాళీ చేయించడం కక్ష్య పూరితం అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు సుప్రీం స్టే తో ఆయన లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది ..ఇది చట్టం తన పని తాను చేకుంటూ పోతుందని చెప్పినప్పటికీ కావాలనే మోడీ ప్రభుత్వం చేస్తున్న పనిగా ప్రజలు భావించడం వల్ల రాహుల్ గాంధీ వైపు ప్రజల చూపు మళ్లింది.

అవిశ్వాసంపై జరిగిన చర్చలో రాహుల్ ప్రసంగాన్ని సంసద్ టీవీలో 3.5 లక్షల మంది వీక్షించారు. ఇదే సమయంలో మోదీ ప్రసంగాన్ని కేవలం 2.3 లక్షల మంది మాత్రమే వీక్షించారు. ఇక యూట్యూబ్ లో రాహుల్ ప్రసంగాన్ని 26 లక్షల మంది వీక్షించగా… మోదీ ప్రసంగాన్ని 6.5 లక్షల మంది మాత్రమే వీక్షించారని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియాలో మోదీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో మోదీని 90.9 మిలియన్ల మంది ఫోలో అవుతున్నారు. రాహుల్ ను 24 మిలియన్ల మంది మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం.

Related posts

కేరళలో పేలుళ్లు… సీఎం విజయన్ తో మాట్లాడిన అమిత్ షా

Ram Narayana

మాల్దీవులు-ఇండియా వివాదం నేపథ్యంలో ‘ఈజ్ మై ట్రిప్’ కీలక ప్రకటన

Ram Narayana

పాక్ మహిళ హనీట్రాప్‌లో చిక్కిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Ram Narayana

Leave a Comment