క్రీడా వార్తలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తోలి మ్యాచ్ లోనే విజయం నమోదు చేసిన బుమ్రా …!

వరుణుడు అడ్డొచ్చినా విజయం టీమిండియాదే!

  • టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20
  • డీఎల్ఎస్ ప్రకారం 2 పరుగులతో నెగ్గిన టీమిండియా
  • తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు
  • టీమిండియా లక్ష్యఛేదనలో 6.5 ఓవర్ల వద్ద వర్షం
  • అప్పటికి 2 వికెట్లకు 47 పరుగులు చేసిన బుమ్రా సేన

ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా, డక్ వర్త్ లూయిస్ విధానం (డీఎల్ఎస్) ప్రకారం టీమిండియా 2 పరుగుల తేడాతో గెలిచింది. 

వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 45 పరుగులు చేస్తే సరిపోతుంది. వర్షం పడే సమయానికి టీమిండియా 2 పరుగులు ముందే ఉంది. ఇక ఎంతకీ వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్ ను విజేతగా ప్రకటించారు. 

డబ్లిన్ లోని ‘ద విలేజ్’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. 

కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.

Related posts

ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ఘనంగా ముగించిన భారత్

Ram Narayana

మెస్సీ ప్రైవేట్ జెట్.. గాల్లో ఎగిరే ప్యాలెస్.. సౌకర్యాలు అదుర్స్!

Ram Narayana

నన్ను మాత్రం అనొద్దు… రోహిత్, శ్రేయస్ అయ్యర్ మధ్య ఆసక్తికర సంభాషణ!

Ram Narayana