Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కష్టపడి రాసిగా పోశాక ఎవరో వస్తే ఊరుకుంటానా?: ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

  • కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు
  • ఆరునూరైనా ప్రజాజీవితంలోనే ఉంటానని వెల్లడి
  • దేవుడు ఉన్నాడు… దేవుడిలాంటి కేసీఆర్ ఉన్నాడని వ్యాఖ్య
  • ప్రజల మధ్యే ఉంటా… ప్రజల మధ్యే చచ్చిపోతానన్న రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గం టిక్కెట్‌ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించారు. దీంతో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టిక్కెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకుంటానని చెబుతూ వస్తున్నారు. తాజాగా, శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… ఆరునూరైనా తాను ప్రజాజీవితంలోనే ఉంటానని చెప్పారు.

నాగలితో దున్ని పంటలు పండించే వరకు కష్టపడి, రాసి పోసిన తర్వాత ఎవరో వస్తానంటే ఊరుకుంటానా? అని వ్యాఖ్యానించారు. మిమ్మల్నందరినీ కాపాడుకుంటానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మనకు దేవుడు ఉన్నాడు… దేవుడిలాంటి కేసీఆర్ ఉన్నాడన్నారు. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నేను ప్రజల మధ్యనే ఉంటాను.. ప్రజల మధ్యే చచ్చిపోతా అన్నారు.

Related posts

తుమ్మల కాంగ్రెస్ లోకి స్వాగతిస్తాం …పొదెం వీరయ్య …!

Ram Narayana

బీఆర్ఎస్ తండ్రీకొడుకుల్ని విడదీసింది… నా కొడుక్కి బీఆర్ఎస్ కండువా కప్పారు: బాబుమోహన్ కంటతడి

Ram Narayana

షబ్బీర్ చేతిలో కేసీఆర్‌కు ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment