Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నాపై ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం: భూమన కరుణాకర్ రెడ్డి

  • విమర్శలకు తాను భయపడే వాడిని కాదన్న భూమన
  • 17 ఏళ్ల కిందటే టీటీడీ చైర్మన్‌గా పని చేశానని వెల్లడి
  • మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగొద్దనే నిర్ణయం తీసుకుంది తానేనని వ్యాఖ్య
  • 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని ప్రకటన

నాస్తికుడని, క్రిస్టియన్ అని తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌‌ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. విమర్శలకు తాను భయపడే వాడిని కాదని స్పష్టం చేశారు. 17 ఏళ్ల కిందటే టీటీడీ చైర్మన్‌గా పని చేశానని గుర్తు చేశారు. తిరుపతిలో మానవ వికాస వేదిక నిర్వహించిన మూడు తరలా మనిషి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. 

‘‘30 వేల మందికి కల్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే. దళితవాడలకు శ్రీవెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి కల్యాణం చేయించాను. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే. నాపై క్రిస్టియన్ ముద్ర వేస్తున్న, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం” అని చెప్పారు. 

ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడినికాదని భూమన కరుణాకర్‌‌రెడ్డి చెప్పారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినని, ఇలాంటి వాటికి భయపడబోనని స్పష్టంచేశారు

Related posts

పిల్లల కోసం పెళ్లికైనా, సహజీవనానికైనా రెడీ: కరాటే కల్యాణి

Drukpadam

చంద్రగ్రహణం తర్వాతి రోజు నుంచి ఆ ఇంట్లో ప్రతి రోజూ మంటలు..

Drukpadam

ఆరోగ్య శాఖకు హరీష్ రావు మార్క్ చికిత్స…

Drukpadam

Leave a Comment