Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ …సిపిఐ లమధ్య ఎన్నికల పొత్తులపై చర్చలు …!

కాంగ్రెస్ …సిపిఐ లమధ్య ఎన్నికల పొత్తులపై చర్చలు …!
నాలుగు సీట్లు కావాలన్నా సిపిఐ ..రెండే ఇస్తామంటున్న కాంగ్రెస్ ..
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఠాక్రే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సిపిఐ నేతల భేటీ
కొత్తగూడెం , హుస్నాబాద్,మునుగోడు , బెల్లంపల్లి కోరిన సిపిఐ
హుస్నాబాద్,మునుగోడు సీట్లు ఇచ్చేందుకు రెడీ అన్న కాంగ్రెస్
మధ్యవర్తల ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనే
ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని ,ఇక ఎలాంటి త్యాగాలకు సిద్ధంగాలేవని వెల్లడి

బీఆర్ యస్ తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలని భావించిన ఉభయ కమ్యూనిస్టులు ఆపార్టీ హ్యాండ్ ఇవ్వడంతో హ్యాండ్ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు …నిన్నమొన్నటివరకు బీజేపీని ఓడించగలిగేది బీఆర్ యస్ మాత్రమేనని చెప్పి బీఆర్ యస్ నమ్మి వారిపై ఈగ వాలకుండా చేసిన కామ్రేడ్స్ కు ఎన్నికల్లో సీట్లు విషయంలో కేసీఆర్ కపటనాటకం అర్థమైంది .బీఆర్ యస్ కు బీజేపీకి మధ్య అవగాహనా ఉందని అంటున్నారు .అందువల్లనే తమతో ఎన్నికల్లో కల్సి పనిచేస్తామని చెప్పిన కేసీఆర్ చివరకు పొత్తు ధర్మాన్ని విస్మరించి అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయనేది చెప్పకనే చప్పారనే విమర్శలు ఉన్నాయి… . పైగా తమకు ఇచ్చిన మాట నుంచి తప్పుకోవడానికి మీరు ఇండియా కూటమిలో ఉన్నారని మీడియా లో ప్రచారం చేయించడంపై లెఫ్ట్ నేతలు మండిపడుతున్నారు . అలాంటప్పుడు చెరొక సీటు ఇస్తామని కేసీఆర్ ఎందుకు అన్నట్లని ప్రశ్నింస్తున్నారు …

ఇక కేసీఆర్ తో చెడిపోవడంతో కాంగ్రెస్ వైపు లెఫ్ట్ పార్టీలు చూస్తున్నాయి…వాస్తవంగా లెఫ్ట్ పార్టీలు సొంతగా గెలవకపోవచ్చు కానీ వారు గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే నియోజకవర్గాలు ఖమ్మం ,నల్లగొండ జిల్లాలతోపాటు మరికొన్ని ఉన్నాయి…అందువల్ల ఇప్పడు కాంగ్రెస్ తో జతకట్టాలని వారితో చర్చలు జరుపుతున్నారు . అందులో భాగంగానే సిపిఐ ప్రతినిధి బృందం ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు థాకరే , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు . వారి చర్చల్లో కొత్తగూడెం , మునుగోడు , హుస్నాబాద్ , బెల్లంపల్లి కోరారని ,కాంగ్రెస్ హుస్నాబాద్ , మునుగోడు స్థానాలను ఇస్తామని తెలిపిందని ప్రచారం జరుగుతుంది…

దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ తాము ఒక మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ నేతన్నలు కలిశామని , కలిసినవారిలో నాతోపాటు పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి , పల్లా వెంకటరెడ్డి , అజిజ్ పాషా ఉన్నారని అన్నారు .. ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదనలు తాము పెట్టలేదన్నారు . వారు అభిప్రాయాలూ మేము మా అభిప్రాయాలూ వారు తెలుసుకున్నారని వివరించారు … అయితే వారు మాతో కలిసి వస్తే సరే లేదంటే మా వ్యూహం మాకున్నదని అన్నారు . అయితే తాము ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని , త్యాగాలకు సిద్ధంగా లేమని వ్యాఖ్యానించడం కొసమెరుపు …అదే సందర్భంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అందుకు తొందర పడాల్సిన పనిలేదని అన్నారు .

Related posts

ఇది వరకు బ్రూకాఫీ ఉండేది… ఇప్పుడు ‘బ్రూ’ ట్యాక్స్ వచ్చింది: కేటీఆర్

Ram Narayana

కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని అడుగుతున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…

Ram Narayana

Leave a Comment