Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జమిలి ఎన్నికల దిశగా అడుగులు …తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు అవకాశం …?

  • దేశంలో ఏకకాలంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణపై కేంద్రం ఆలోచన
  • మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చైర్మన్ గా కమిటీ
  • తాజాగా సభ్యులను నియమించిన కేంద్రం

దేశంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

తాజాగా ఈ కమిటీలో సభ్యులను నియమించింది. 8 మంది సభ్యులతో ఈ కమిటీకి రూపకల్పన చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా రామ్ నాథ్ కోవింద్ వ్యవహరిస్తారు. అమిత్ షా, అధిర్ రంజన్, గులాంనబీ ఆజాద్, ఎన్ కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 

ఒకే దేశం-ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కాగా, సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం… ఈ సమావేశాల్లోనే ఒకే దేశం-ఒకే ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

జమిలి ఎన్నికల దిశగా అడుగులు …తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు అవకాశం

ఒకే దేశం ఒకే ఎన్నిక …పరిశీలనకు 8 మంది సభ్యులతో కమిటీ ని కేంద్ర ఏర్పాటు చేసింది…దీన్నే జమిలి ఎన్నికలు అనికూడా అంటారు …ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది. అయితే పెద్ద దేశమైన భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా అనే సందేహాలు లేకపోలేదు…29 రాష్ట్రాలు 140 కోట్ల జనాభా , 542 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందుకోసం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణకు చట్టం చేయాలి అందుకు 14 రాష్ట్రాల్లోని శాసనసభలు తీర్మానాలు చేసి పంపాలి. అంతే కాకుండా లోకసభలో ,రాజ్యసభలో 2 /3 మెజార్టీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాలి …ఇప్పుడున్న లెక్క ప్రకారం లోకసభలో, రాజ్యసభలో వీధివీధిగా 67 శాతం చొప్పున సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ పక్షాల బలం లోకసభలో 61 శాతం ఉండగా , రాజ్యసభలో 40 శాతం మాత్రమే ఉంది…ఒకవేళ రెండు సభల్లో రెండు బై మూడవ వంతు బిల్లుకు మద్దతు తెలిపితే చట్టం చేసే అవకాశం ఉంటుంది.. దీంతో రేపు ఎన్నికలు జరగాల్సిన తెలంగాణ , రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్ , లాంటి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనా విధించి రెండు మూడు నెలల తర్వాత ఎన్నికలు జరిపే అవకాశం ఉంది… అప్పడు గవర్నర్ ల ఏలుబడిలోకి ఆ రాష్ట్రాల పాలనా పోతుంది …

Related posts

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు!

Drukpadam

ఖమ్మం సీపీగా కొల్లు సురేష్ కుమార్!

Drukpadam

లబ్దిదారులను మోసం చేస్తున్న టీఆర్ యస్ ప్రభుత్వం :రేవంత్ రెడ్డి !

Drukpadam

Leave a Comment