Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …

యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …
కాంగ్రెస్ ది గోబెల్స్ ప్రచారం …మాది నోబుల్ ప్రచారం
వారిది తన్నులాట …మాది టన్నులాట …
వారు ప్రాజక్టులు దండగ చేస్తే ..మేము పండగ చేస్తున్నాం
వారు శకుని పాత్ర పోషిస్తే …మేము ధర్మాన్ని రక్షిస్తున్నాం
కేసీఆర్ ఇంటిమనిషి …నిర్ణయాలు అన్ని ఇక్కడే
కాంగ్రెస్ ది ఢిల్లీ వయా బెంగుళూరు
ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం ఖమ్మంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ విధానాలపై యతి ప్రాసలతో విరుచుకపడ్డారు …వారిది గోబెల్స్ ప్రచారం అయితే మాది నోబుల్ ప్రచారమని తనదైన శైలిలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందినదని నేడు ఆర్టీసీ కార్మికుల బిల్లు ఎట్టకేలకు గవర్నర్ ఆలస్యంగానైనా ఆమోదించడం సంతోషకరమన్నారు . ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు అందరు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. నేడు రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ బీజేపీలో చూసి ఓర్వలేక పోతున్నాయని విమర్శలు గుప్పించారు . వారు ఎంతసేపటికి అభివృద్ధిని అడ్డుకునేందుకు శకుని పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు . ప్రాజక్ట్ లను వారు దండగ చేస్తే మేము పండగ చేశామని అన్నారు . వారిది తన్నులాటా అయితే మాది టన్నులాట అని కాంగ్రెస్ పార్టీ గొడవలపై ఛలోక్తులు విసిరారు . ఖమ్మంలో కూడా వారు తన్ను కున్న విధానాన్ని గుర్తు చేశారు ..

రాష్ట్రాన్ని అన్ని రంగాగాల్లో ముందుకు నడిపిస్తున్న పనోల్లు మనకు కావాలా, పగోల్లు కావాలా ప్రజలు ఆలోచించాలి కోరారు …ఇప్పటికే ప్రజలు బి ఆర్ ఎస్ కావాలి, కాంగ్రెస్ వద్దు అని అంటున్నారు.
.
ఆటో డ్రైవర్ కొడుకు, హమాలీ కూలికి ఎంబిబిఎస్ చదవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు .ఎల్ కె కి చదువు ఎంతో ఖర్చుతో కూడుకున్న రోజులు. కానీ ఎంబిబిఎస్ ఫీ కేవలం 10 వేలు మాత్రమేనని హరీష్ రావు పేర్కొన్నారు .ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ …ఐటీ ఉత్పత్తిలో, ఫార్మా రంగంలో, విద్య, వైద్యం, పంట, పాడి ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రస్థానం…..పాడి పంట, బడి మడి ఏదైనా చూడండి…50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు. …ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు విపక్షాలపై ధ్వజమెత్తారు .

ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు. కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటున్నారు.
ఛత్తీస్ గడ్, కర్ణాటక, రాజస్థాన్ లో చేయరు.. కానీ ఇక్కడ ఎలా చేస్తారు… ఎరువుల కోసం ప్రజలు తన్నులు తినేవారు. తన్నుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అయితే బి ఆర్ ఎస్ హయాంలో టన్నుల (పంట ఉత్పత్తి) సంస్కృతి అని మంత్రి ఉదహరించారు .

.ఖమ్మం కరుణ కేసీఆర్, బి ఆర్ ఎస్ పై ఉండాలి. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉంది. ఇక్కడి ప్రాంతం సస్య శమలం కావాలంటే కేసీఆర్ దీవించండి…సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదు. …వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయి…. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారు.

Related posts

మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Ram Narayana

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామ

Ram Narayana

పార్టీ మార్పు ప్రచారం… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment