Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు బెయిలు, క్వాష్ పిటిషన్ లపై ముగిసిన వాదనలు …తీర్పు రిజర్వు

చంద్రబాబు బెయిలు, క్వాష్ పిటిషన్ లపై ముగిసిన వాదనలు …తీర్పు రిజర్వు…!
హైకోర్టు లో వాదనలు వినిపించిన సుప్రీం న్యాయవాదులు
చంద్రబాబు పక్షాన లూద్ర, సాల్వే సి ఐ డి తరుపున ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీ
హోరాహోరీ వాదనలు …కిక్కిరిసిన కోర్ట్ హాల్

చంద్రబాబు అరెస్టు ఆక్రమణ , అతనికి స్కిల్ డవలప్మెంట్ సంస్థకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అందువల్ల ఆయన పై పెట్టిన అక్రమకేసులను కొట్టి వేయాలని కోరారు ..ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరుపున సిద్దార్ద్ర లూద్ర, హరీష్ సాల్వే,దమ్మాలపాటి శ్రీనివాస్ రావు అనే లాయర్లు వాదించారు . చంద్రబాబుపై సెక్షన్ 409 వర్తించదని ,అసలు స్కిల్ డవలప్మెంట్ లో అవినీతి జరగలేదని తమ వాదనలు వినిపించారు . మరో పక్క ఏపీ సి ఐ డి తరుపున ప్రభుత్వ లాయర్లతో పాటు ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీ తన వాదనలను గట్టిగ వాదించారు . చంద్రబాబు అవినీతి బయట పడినందునే అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు . దేశంలో ఇలాంటి కేసుల తీర్పులను ఆయన ఉదహరించారు .ఎక్కడ స్కిల్ డవలప్మెంట్ లేకుండానే డబ్బు కాజేశారని వాదించారు . మొత్తం రిపోర్ట్ 900 పేజీలు ఉందని అది మొత్తం చదువుకొని రావడానికి టైం పడుతుందని అన్నారు . ఇరు పక్షాల వాదనలను శ్రద్దగా విన్న డివిజన్ బెంచ్ తీర్పుపై వాయిదా వేసింది…

ఏపీ హైకోర్టులో ఈ వాదనలు స్వయంగా వినేందుకు హైకోర్టు న్యాయవాదులు ఆసక్తి చూపారు . దీంతో కోర్టు హాల్ కిక్కిరిసి పోయింది…ఈ సందర్భంగా కోర్ట్ ప్రాగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు . ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు ఒక పక్క కొత్త పార్లమెంట్ లో సమావేశాలు ప్రారంభంకావడంతోపాటు అక్కడ జరుగుతన్న చర్చలను , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో జరుగుతున్న వాదనల విశేషాలకు టీవీ లకు అతుక్కు పోయారు .అయితే ఇరు పక్షాల వాదనలను విన్న హైకౌట్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది…

Related posts

పదమూడేళ్ల అమ్మాయి.. పాతికేళ్ల అబ్బాయి.. ఇద్దరి సాన్నిహిత్యం ప్రేమేనని తేల్చిన బాంబే హైకోర్టు

Ram Narayana

దేవినేని, నల్లారి లను సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏఏజీ

Ram Narayana

చార్జ్‌షీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలనేం లేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Ram Narayana

Leave a Comment