Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఢిల్లీలో న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై దాడి గర్హనీయం …ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి ..ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి…

ఢిల్లీలో న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై దాడి గర్హనీయం …ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి ..ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి
-దేశవ్యాపితంగా నిరసనలకు పిలుపు
-జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటామని హెచ్చరిక ..

  • దాడులను గర్హిస్తూ రేపు హైదరాబాద్ లో భారీ ర్యాలీ
    -ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు

ఢిల్లీలో న్యూస్ క్లిక్ పై వెబ్ పోర్టల్ పై దాడి గర్హనీయం …ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడినే అని ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఇది ఎమర్జన్సీ చీకటిరోజులను తలపించేదిగా ఉందని మండి పడ్డారు . ఇలాంటి చర్యలను రాజకీయ పక్షాలు , ప్రజాస్వామ్య వాదులు , ప్రజలు , ప్రజాసంఘాలు , ఖండించాలని పిలుపు నిచ్చారు . దేశవ్యాపితంగా ఇప్పటికే ఐజేయూ ఆధ్వరంలో పెద్ద ఎత్తిన నిరసనలు జరిగిన విషయాన్నీ తెలిపారు . ఇది అత్యంత హేయమైన చర్య ఇటీవలనే ఘనంగా దేశరాజధాని ఢిల్లీలో జి-20 సదస్సును చైర్మెన్ స్థానంలో ప్రధాని మోడీ మనదేశ ప్రజాస్వామ్య గురించి చాలాగొప్పగా చెప్పారని అందుకు భిన్నంగా మీడియా స్వచ్ఛపై దాడులు జరగడం ఎలాంటి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు .న్యూస్ క్లిక్ పై వెబ్ పోర్టల్ కు చైనా నుంచి నిధులు వస్తున్నాయనే సాకుతో ఒక్కసారిగా తెల్లవారుజామున వెబ్ పోర్టల్ యాజమాన్యంపై , అందులో పనిచేసే జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందని ప్రశ్నించారు .ఇప్పటికే మీడియా స్వేచ్ఛలో 180 దేశాల వివరాలు సేకరించగా మనదేశం 161 స్థానంలో ఉందని ఇది మన పాలకులు సిగ్గుపడాల్సిన విషయమన్నారు . తమను ప్రశ్నించే సంస్థలను , వ్యవస్థలను టార్గెట్ చేసి ఇబ్బందులు గురిచేయడంపై మేధావులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు .

ప్రముఖ సంపాదకులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని అన్నారు . చైనా నిధులు వస్తున్నాయనే సాకుతో దాడులు జరపడం శోచనీయమని అన్నారు . ఇది రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలని ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు . కేంద్ర ప్రభుత్వ విధానాలను, అధికార పార్టీ భావజాలాన్ని విమర్శిస్తూ రాసే వారిని లక్ష్యంగా పెట్టుకొని జరిగే దాడులుగా ఉన్నాయని అన్నారు. వీటిని సమైక్యంగా ప్రతిఘటించాలని జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈసందర్భంగా జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర , నగర నేతలు ప్లైకార్డ్ లు ధరించి ప్రదర్శన నిర్వహించారు . పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి. ఢిల్లీలో న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే)ల ఆధ్వర్యంలో బుధవారంనాడు బషీర్ బాగ్ లో నిరసన ప్రదర్శన జరిగింది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ,
ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, కల్లూరి సత్యనారాయణ, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శంకర్ గౌడ్, షౌకత్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ రాజేష్, బీ కిరణ్ కుమార్, కల్కురి రాములు, జనం సాక్షి సంపాదకుడు రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

రేపు భారీ ర్యాలీ

న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై జరిగిన దాడులను గర్హిస్తూ గురువారం నాడు ఉదయం 11గంటలకు, బషీర్ బాగ్ లోని ఎల్బీ స్టేడియం ప్రక్కన ఉన్న తమ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి, ఎన్.శేఖర్, కే.విరాహత్ అలీ తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తులు, సంపాదకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పౌర సంఘాల కార్యకర్తలు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటారని వారు చెప్పారు.

Related posts

క్యూఆర్‌ కోడ్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ

Ram Narayana

ప్రధాని నరేంద్రమోదీకి తాను రాసిన పుస్తకం కాపీని అందించిన ప్రణబ్ కూతురు

Ram Narayana

చంద్రయాన్-3 ఘనత మాజీ ప్రధాని నెహ్రూదే: ఛత్తీస్ గఢ్ సీఎం

Ram Narayana

Leave a Comment