షర్మిల తప్పటడుగులు …విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తారా …?
పాలేరు , మిర్యాలగూడ రెండు స్థానాల్లో షర్మిల పోటీనా …?
సికింద్రాబాద్ నుంచి విజయమ్మ బరిలోకి దిగే అవకాశం
ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ అధ్యక్షురాలు
కాంగ్రెస్ తో చర్చలు విఫలమైనట్లేనా ..
తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి 3 800 కి .మీ పాదయాత్ర చేసిన వైయస్ షర్మిల తనకు అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో డీలాపడ్డారు . కాంగ్రెస్ లో తనపార్టీలో విలీనం చేసేందుకు సోనియా , రాహుల్ ప్రియాంక గాంధీ ని కలిసి చర్చలు జరిపారు . మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ కలిసి పోతుందని జోరుగా ప్రచారం జరిగింది…ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఆమె పార్టీ విలీనంపై నీలినీడలు అలుముకున్నాయి. ఇక ఆమె కాంగ్రెసుతో లాభంలేదనికొని తమపార్టీ తరుపున సొంతంగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం .షర్మిల మొదటినుంచి చెపుతున్న విధంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడం నుంచి పోటీచేస్తారని తెలుస్తుంది. ఆమెతోపాటు తల్లి విజయమ్మ కూడా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో ఉంటారని ఆపార్టీ నేతలు అంటున్నారు . వారితోపాటు మరికొందరిని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం
ప్రస్తుతం నియోజక వర్గాలవారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి గుడిపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేట నుంచి నర్సింహారెడ్డి, సిరిసిల్ల నుంచి చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావులు బరిలో ఉంటారని తెలుస్తోంది…