Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుతెలంగాణ వార్తలు

తెలంగాణాలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆకస్మిక బదిలీలు …!

తెలంగాణాలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆకస్మిక బదిలీలు …!
ఎన్నికల సంఘం సిఫార్స్ మేరకు బదిలీ ఉత్తర్వులను జారీచేసిన సీఎస్ శాంతకుమారి
ధన ప్రభావం , అధికార దుర్వినియోగం అరికట్టేందుకే అంటున్న అధికార వర్గాలు

తెలంగాణాలో ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ప్రధానంగా జిల్లా బాస్ లుగా వ్యవరించే పలు జిల్లాలకు చెందిన ఐఏఎస్ , ఐపీఎస్ లను బదిలీ చేస్తే ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేశారు . ఇద్దరు అధికారులను వారి విధులనుంచి తొలగించాలని సిఫార్స్ చేసింది …

రాష్ట్రంలోని బదిలీ అయినా ఐఏఎస్ లలో భవనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ,మేడ్చల్ కలెక్టర్ , రంగారెడ్డి కలెక్టర్లు వినయ్ కృష్ణ రెడ్డి , అమాయకుమార్ కమర్షియల్ టాక్స్ అధికారి శ్రీదేవి, ఎక్సయిజ్ కమిషనర్ సర్ఫరాజ్ అలీ రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ రాజు లతోపాటు 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు.

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. పనితీరు మరియు సంబంధిత ఇన్‌పుట్‌లను అంచనా వేసిన తర్వాత, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు. వీరిలో హైద్రాబాద్ సీపీ ఆనంద్ ,వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ , నిజామాబాద్ సీపీ సత్యనారాయణ , ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వరియార్ ఉన్నారు .

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు , ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ముషారఫ్ అలీ , కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ శ్రీదేవి లను తొలగించాలని కమిషన్‌ ఆదేశించింది.

ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం..

Ram Narayana

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!

Ram Narayana

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం అర్ధిస్తుంటే.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు!

Ram Narayana

Leave a Comment