Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దోపిడీ పాలకులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: మల్లు భట్టి

దోపిడీ పాలకులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: మల్లు భట్టి
బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్న మల్లు భట్టి
బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ ఉందనీ, వీరికి మజ్లిస్ సహకరిస్తోందని ఆరోపణ
అందరూ ఓటేసి దోపిడీదారులకు బుద్ధి చెప్పాలని పిలుపు

బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. వీరికి మజ్లిస్ పార్టీ కూడా సహకరిస్తోందన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆస్తులను కేంద్రంలోని బీజేపీ అమ్ముకుంటుంటే, తెలంగాణలోని భూములను కేసీఆర్ అమ్మి సొమ్ములు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు . తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దోపిడీదారులు, దొరల చేతుల్లో పెట్టేందుకు కాదన్నారు. దోపిడీ పాలకులను తెలంగాణ నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలన్నారు.తెలంగాణ తెచ్చుకుంది దొరలు దోపిడి దారుల కోసం కాదన్నారు .నాలుగున్నర కోట్ల ప్రజల బాగు పడడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు .

టిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని భట్టి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు ..పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు, పది సంవత్సరాల బడ్జెట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు .మాటలు మాత్రం కోటలు దాటించే టిఆర్ఎస్ నాయకులు ఎన్నికలవేళ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు

ఓటు మన భవిష్యత్తుకు ఉపయోగపడేది. అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడే ఓట్లను మోసగాళ్లకు, దోపిడిదారులకు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేయాలని విజ్ఞప్తి చేశారు ..

రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపితో చేతులు కలిపి తెలంగాణలో బిజెపికి బీ టీం గా పనిచేస్తున్న విషయం ప్రధాని మాటలతో తేటతెల్లమైంది అన్నారు .
ఎంఐఎం పార్టీ కూడా వంత పాడుతూ వారికీ భజన చేస్తుందని ఆరోపించారు …

దేశ సంపదను ఆదాని భవన జాతి కంపెనీలకు దోచిపెట్టి ప్రధాని మోడీకి ఉపయోగపడే విధంగా మారిన బిఆర్ఎస్ ఇంటికి పంపకపోతే రాష్ట్రం అదోగతి పాలు కావడం ఖాయమని భట్టి హెచ్చరించారు . బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనన్నారు తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ఎంపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు మద్దతుగా బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారుని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముతున్న బిజెపికి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కు ఓట్లు వేద్దామా? లేక ప్రజలకోసం దేశాన్ని ప్రగతి పధంలో నిలిపిన కాంగ్రెస్ కు ఓటు వేద్దామని ఆలోచించాలని అన్నారు . తెలంగాణకు సిరుల బంగారం కురిపిస్తున్న సింగరేణి కాలరీస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ సంపదలను దోచుకుంటున్నాయని విమర్శించారు …హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తున్నదని ఇదేనా సంపద సృష్టించడం అని భట్టి ప్రశ్నించారు . టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను తన బినామీల పేరిట నమోదు చేస్తున్నదని ఆరోపణలు గుప్పించారు .

రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లాంటి రాష్ట్ర ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం పనికిమాలిన సంస్థలకు లీజికి ఇచ్చి రాబోయే 30 సంవత్సరాల ఆదాయాన్ని దోపిడీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పునః పరిశీలన చేస్తామన్నారు .

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత గిరిజనులకు చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కదోవ పట్టించారని దుయ్యబట్టారు . రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో సగం బడ్జెట్ కేటాయించాల్సిన సీఎం కేసీఆర్ బీసీ బందు పేరిట తూతూ మంత్రంగా నిధులు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఇష్టంలేని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ మూడు లక్షలు రూపాయలు గృహలక్ష్మి పేరిట ఇచ్చారు అవి ఎన్నికల ముందు ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయని కేసీఆర్ విధానాలను భట్టి తూర్పార బట్టారు .

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న దోపిడిదారులను తరిమికొడతామని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దోపిడి దారులను తరిమికొట్టే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి భట్టి పిలుపు నిచ్చారు …

Related posts

తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తాం: ఈటల రాజేందర్

Ram Narayana

 ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

Ram Narayana

దోశ వేసి ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment