Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు అని నిలదీద్దాం… నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పిలుపు

  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం
  • నేటి రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు కార్యక్రమం
  • చేతులను తాళ్లు, రిబ్బన్లతో కట్టివేసుకోవాలన్న భువనేశ్వరి, బ్రాహ్మణి
  • బాబుతో నేను అంటూ ప్రకటించాలని పిలుపు
Nara Bhuvaneswari and Brahmani calls for Nyayaniki Sankellu activity

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతోంది. ఇప్పటివరకు మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన టీడీపీ శ్రేణులు… నేడు ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. 

దీనిపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్పందించారు. “నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు మీ చేతులను తాళ్లు లేదా రిబ్బన్లతో కట్టివేసుకుని సంకెళ్లలాగా  ప్రదర్శించండి… ఇళ్ల నుంచి బయటికి వచ్చి, లేదా బాల్కనీల్లోకి వచ్చి ఆ సంకెళ్లను ప్రదర్శించండి… ‘న్యాయానికి సంకెళ్లు’ ఇంకెన్నాళ్లని వ్యవస్థలను నిలదీద్దాం అని వారు పిలుపునిచ్చారు. 

‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా రాష్ట్రంలో నిజాయతీకి గ్రహణం పట్టిన విషయాన్ని ప్రపంచానికి తెలియచెప్పండి… ‘బాబుతో నేను’ అంటూ ప్రకటించండి” అని భువనేశ్వరి, బ్రాహ్మణి కోరారు.

Related posts

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

Ram Narayana

ఇన్నర్ రింగ్ రోడ్ లో 7 కోట్ల విలువైన నాభూమి పోయింది …మాజీమంత్రి నారాయణ

Ram Narayana

అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

Ram Narayana

Leave a Comment