తెలంగాణ రాజకీయ వార్తలు ..

17న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న బీజేపీ

  • ఈ నెల 17న తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ మేనిఫెస్టో విడుదల
  • ఆ తర్వాత తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్న అమిత్ షా

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్నారు. అదే రోజు సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తారు. 17వ తేదీన నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్… ఎవరికి వారు అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి… కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

Ram Narayana

అన్ని పార్టీల టార్గెట్ బీజేపీనే: బండి సంజయ్

Ram Narayana

బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana