Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ రాజీనామా

  • కష్టపడిన వారికి పార్టీలో సముచిత స్థానం దొరకడం లేదని ఆవేదన
  • సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పని చేశానని వ్యాఖ్య
  • ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్న అనిల్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పటాన్ చెరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టుకుని పార్టీ కోసం పని చేశానని… టికెట్ ఇస్తానంటేనే ఐదేళ్ల క్రితం తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. అప్పుడు, ఇప్పుడు తనకు పార్టీలో అన్యాయం చేశారని మండిపడ్డారు. తన అనుచర వర్గంతో చర్చించి ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. జాతీయ పత్రికలకు యాడ్స్ ఇవ్వడంతో తనకు ఈడీ నోటీసులు అందాయని… అయినప్పటికీ రాష్ట్ర నాయకులు తమను కనీసం పలకరించలేదని అన్నారు. 

Related posts

తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

Ram Narayana

నడ్డా… తెలంగాణ కేసీఆర్ అడ్డా: హరీశ్ రావు

Ram Narayana

కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Ram Narayana

Leave a Comment