Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఛత్తీస్ గఢ్ లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

  • ఛత్తీస్ గఢ్ లో నేడు రెండో విడత పోలింగ్
  • సాయంత్రం 5 గంటల సమయానికి పూర్తయిన పోలింగ్
  • సీఎం, డిప్యూటీ సీఎం సహా ఎనిమిది మంది మంత్రుల పోటీ
  • మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈ నెల 7న తొలి విడత పోలింగ్  జరగ్గా… నేడు 70 స్థానాలకు తుది విడత పోలింగ్ చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఓటింగ్ పూర్తయింది. ఛత్తీస్ గఢ్ లో డిసెంబరు 3న ఓట్ల లెక్కించనున్నారు. ఛత్తీస్ గఢ్ లో రెండో విడత పోలింగ్ బరిలో మొత్తం 958 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సీఎం భూపేశ్ బఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ తో పాటు 8 మంది రాష్ట్ర మంత్రులు, నలుగురు ఎంపీలు తుది విడత ఎన్నికల్లో పోటీ చేశారు. 

అటు మధ్య ప్రదేశ్ లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.52 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ డిసెంబరు 3నే ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related posts

కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై ఎన్నికల సంఘం బదలీ వేటు

Ram Narayana

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Ram Narayana

ఖమ్మం జిల్లాలో 14 మంది అభ్యర్థుల తిరస్కరణ …

Ram Narayana

Leave a Comment