Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్, కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

  • తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారన్న జేపీ నడ్డా
  • ఫరూక్ అబ్దుల్లా నుంచి వైఎస్ కుటుంబం వరకు దేశంలో కుటుంబ రాజకీయాలు ఉన్నాయని వెల్లడి
  • తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ రాజకీయాలు వచ్చాయన్న జేపీ నడ్డా
  • ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని ఆరోపణ

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్‌లో లాలు కుటుంబం, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ది చేకూరిందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు.

తెలంగాణలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ ప్రజల కోసం పని చేస్తుంటే కేసీఆర్ సంతుష్టీకరణ కోసం పాలిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా? అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ.. అవినీతి రాజ్యమేలుతుందన్నారు.

Related posts

తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

Ram Narayana

రాష్ట్రం వచ్చాక ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదు.. మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్: కేటీఆర్​

Ram Narayana

తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్ సింగ్

Ram Narayana

Leave a Comment