Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శుక్ర,శని రెండు రోజులు ప్రియాంక గాంధీ పర్యటన

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శుక్ర,శని రెండు రోజులు ప్రియాంక గాంధీ పర్యటన
శుక్రవారం కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో ,కార్నర్ మీటింగ్
శనివారం ఖమ్మం ,పాలేరు ,సత్తుపల్లి ,మధిర నియోజకవర్గాల్లో రోడ్ షో లు
మధిరలో మధ్యాహ్నం రోడ్ షో సభ …
ప్రియాంక పర్యటనల పర్వేక్షణకు ఢిల్లీ నేతలు రాక

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 24 25 తేదీలలో ఎన్నికల ప్రచార నిమిత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు …శుక్రవారం సాయంత్రం ప్రియాంక కొత్తగూడెం చేరుకొని అక్కడ కాంగ్రెస్ బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా జరిగే రోడ్ షో , కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు .. ఆమె రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పర్యటన ఏర్పాట్లు చేస్తున్నాయి..ఖమ్మంలో ఆమె పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన ఏఐసీసీ బృందం స్థానిక నేతలకు కొన్ని సూచనలు చేసింది…ఆమె పర్యటనలో పాల్గొనే వాహనాలు , వాటి వివరాలు ముందుగానే పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది ..అందుకు రాష్ట్ర ప్రచార కమిటీ కో- చైర్మన్ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏఐసీసీ నేతలు సమావేశం అయ్యారు …

24, 25 తేదీలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తి ,1:30 గంటలకు హుస్నాబాద్ ,అక్కడి నుండి సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న రాత్రి ఖమ్మంలో బస చేయనున్న ప్రియాంక…25 న 11:00 గంటలకు ఖమ్మం,పాలేరు , 1:30 కి సత్తుపల్లి ,2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

కొత్తగూడంలో జరిగే రోడ్ షో లో ప్రియాంకతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి కె .నారాయణ పాల్గొంటారు ..ప్రియాంక గాంధీ పర్యటనలు జయప్రదం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి….పొంగులేటి , తుమ్మల , కూనంనేని , మత్త రాగమయి , భట్టి ల విజయాన్ని కాంక్షిస్తూ జరిగే సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి…

Related posts

తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించబోరు: విజయశాంతి

Ram Narayana

కొడంగల్ నియోజకవర్గంలో నా బల… రేవంత్ రెడ్డి…

Ram Narayana

బీఆర్ఎస్ కు మరో షాక్.. దీపా దాస్ మున్షీతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి భేటీ!

Ram Narayana

Leave a Comment