తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇక ప్రజల సర్కారు పని మొదలైంది: రాహుల్ గాంధీ

  • తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
  • డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క… మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం
  • రేవంత్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
  • బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామంటూ ట్వీట్

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. “ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు. ఇక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని మొదలైంది. బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తాం. మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Related posts

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం: యూపీ సీఎం యోగి

Ram Narayana

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించిన కేసీఆర్

Ram Narayana

బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర రూ.400 దాటడం ఖాయం: కేసీఆర్

Ram Narayana