- ముగిసిన బిగ్ బాస్ సీజన్-7
- విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ
- మారుతి బ్రెజా కారు, జోయాలుక్కాస్ గిఫ్ట్ ఓచర్
- తన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానన్న పల్లవి ప్రశాంత్
మూడు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ ను ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నాడు. ఇవాళ ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరిలను హోస్ట్ నాగార్జున స్టేజిపైకి తీసుకువచ్చారు. అనంతరం… పల్లవి ప్రశాంత్ విజేత అంటూ అనౌన్స్ చేశారు. అమర్ దీప్ చౌదరిని రన్నరప్ గా ప్రకటించారు.
బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ హోదాలో పల్లవి ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ అందించారు. దాంతో పాటే మారుతి సుజుకి బ్రెజా కారు, జోయాలుక్కాస్ నుంచి రూ.15 లక్షల గిఫ్ట్ వోచర్ కూడా లభించాయి.
టైటిల్ గెలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ, తాను ముందు చెప్పినట్టుగా తాను గెలిచిన ప్రైజ్ మనీలో ప్రతి పైసా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని వేదిక పైనుంచి ప్రకటించాడు. ఇక కారును తన తండ్రికి ఇస్తానని, తల్లికి నెక్లెస్ ఇస్తానని తెలిపాడు.