Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఉచిత బస్సు సర్వీస్ పై భిన్నాభిప్రాయాలు …ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా …?

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాపితంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది… దాన్ని అధికారంలోకి వచ్చిన రెండవరోజునుంచే అమలు ప్రారంభించింది …దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… అందరి మహిళలకు ఉచితం సరైంది కాదని మహిళలే అభిప్రాయపడుతున్నారు …దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది …పేద మహిళలకు, వృద్దులకు , కాలేజీ విద్యార్థినులకు వర్తింప చేయాలి కానీ ,ఉన్నత వర్గాల మహిళలకు , ఉద్యోగులకు , టికెట్ లేని ప్రయాణం కరెక్ట్ కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఎం వెంకటాయపాలెం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు తమను ఉచిత బస్సు సౌకర్యం అవసరం లేదని తాము టికెట్స్ తీసుకొనే బస్సు ల్లో ప్రయాణం చేరాయని తీర్మానించుకున్నారు …వారి నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి…ప్రభుత్వం కూడా దీన్ని పేదలకు పరిమితం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు …అదే విధంగా పురుషుల్లో కూడా వృద్దులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే విజ్ఞాపనలు ఉన్నాయి…

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు పేర్కొన్నారు. తమకు టికెట్ తీసుకుని ప్రయాణంచేంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు.

ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని కాలేజీ విద్యార్థులు, పేదలు, వృద్ధులకు వదిలేయాలని నిర్ణయించారు. తమ నిర్ణయం వల్ల ఆర్టీసీకి అండగా ఉన్నామన్న తృప్తితోపాటు ఆటో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, బస్సుల్లో వీరికి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

We dont want free bus service buy ticket and travel says Khammam teachers

Listen to the audio version of this article

.. టికెట్ తీసుకునే వెళ్తాం..

Related posts

దశలవారీగా రైతుబంధు… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

నాపై నమోదైన అక్రమ కేసు కొట్టివేయండి: హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్

Ram Narayana

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

Ram Narayana

Leave a Comment