Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడా?.. ఛోటా షకీల్ ఏం చెప్పాడంటే!

  • విష ప్రయోగం కారణంగా దావూద్ చనిపోయాడంటూ వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న ఛోటా షకీల్
  • దావూద్ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నాడని వెల్లడి
Chhota Shakeel Breaks Silence on Dawood Ibrahim death news

పాకిస్థాన్ లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై దావూద్ సన్నిహితుడు ఛోటా షకీల్ స్పందిస్తూ… ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. వెయ్యి శాతం ఆరోగ్యంగా, ఫిట్ గా దావూద్ ఉన్నారని తెలిపాడు. దావూద్ పై క్రమం తప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటీవలే పాకిస్థాన్ లో దావూద్ ను తాను కలిశానని చెప్పాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.

మరోవైపు ఇండియా శత్రువులుగా భావించే వ్యక్తులు పాకిస్థాన్ లో వరుసగా హత్యకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమారుస్తున్నారు. ఇండియాలో 2024లో లోక్ సభ ఎన్నికలు జరిగేలోపు మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆందోళనకు గురవుతోంది. ఒక్కొక్కరిని ఇండియా ఏజంట్లే హతమారుస్తున్నారని భావిస్తోంది.

Related posts

 భారత్, మాల్దీవులకు మధ్య ఏమిటీ జగడం…?

Ram Narayana

కాల్పుల్లో గాయపడ్డ స్లోవేకియా ప్రధానికి విజయవంతంగా సర్జరీ..!

Ram Narayana

చంద్రయాన్-3 కథ ఇక ముగిసినట్టే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై ఆశలు వదిలేసుకున్న ఇస్రో

Ram Narayana

Leave a Comment