Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

  • లోక్ సభలోకి దుండగుల చొరబాటుపై దద్దరిల్లుతున్న పార్లమెంట్
  • ఇప్పటి వరకు 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
  • ఈరోజు ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారీ తదితరుల సస్పెన్షన్
49 more MPs suspended from Lok Sabha

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. లోక్ సభలోకి దుండగుల చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. డిసెంబర్ 13న జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. తాజా సస్పెన్షన్లతో కలిపి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య (ఉభయ సభలు) 141కి చేరుకుంది. లోక్ సభలో 95 మంది, రాజ్యసభలో 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు.

Related posts

 ప్రధాని మోదీ ఏమైనా దేవుడా? ఆయన వస్తే ఏమవుతుంది?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

బీజేపీకి మిత్రపక్షం షాక్.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు!

Ram Narayana

కొత్త ఎంపీల్లో 105 మంది చదివింది ఇంటర్ లోపే…

Ram Narayana

Leave a Comment