తెలంగాణ వార్తలు

తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం ?

  • తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం
  • తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు
  • ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను మందలించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్‌ ప్లేట్‌ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించారని తలంటు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అధికారిక నివాసానికి పెట్టిన నేమ్‌ ప్లేట్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రాసిన తెలంగాణ భవన్ అధికారులు… ఉర్దూని విస్మరించారు. తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ ఉంది. ఉర్దూని విస్మరించి… మూడు భాషల్లో నేమ్‌ ప్లేట్‌ అధికారులు తయారు చేయించారు. ఈ క్రమంలో ఉర్దూని కూడా కలిపి మరో నేమ్‌ ప్లేట్ బోర్డు తయారు చేయించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు.

Related posts

విద్యుత్ రంగాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

కార్పొరేట్ వర్సిటీలకు దీటుగా ఉస్మానియా.. రూ.1000 కోట్లతో అభివృద్ధి!

Ram Narayana

రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష!

Ram Narayana