Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు …కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ !

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్న మాటలను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జరిగిన సమావేశం అన్నారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈభేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా ప్రయాణించలేమని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, చివరి వరసలో ఉన్న పేదలకు సంక్షేమం అందితేనే అభివృద్ధి జరిగిందని చెబుతామని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ, నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు. అధికారులు జవాబుదారీగా పని చేసి ప్రజల మనసు గెలుచుకోవాలన్నారు. ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని హెచ్చరించారు.
డ్రగ్స్‌ నిషేదానికి పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టాలి. గంజాయి అనే పదం రాష్ట్రంలో వినపడకూడదు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించకండి. పోలీసులకు సంపూర్ణ అధికారాలు ఇస్తున్నాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు.ఇవి అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలి. అన్ని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఎంతటివారినైనా ఇంటికి పంపించే చైతన్యం తెలంగాణ ప్రజల్లో ఉందని అన్నారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి, ప్రజల చైతన్యం గుర్తుపెట్టుకొని పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

 అధికారులపై ఎలాంటి వివక్ష ఉండదు… బాధ్యతగా పనిచేయండి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy held meeting with district collectors and police superintendents

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. 

“మీరు వివిధ రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, ఆలిండియా సర్వీసు పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి పౌరులతో మమేకం అయ్యారు. 

మాది వేరే రాష్ట్రం అనో, మా భాష వేరు అనో మీరెవరూ భావించాల్సిన పనిలేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ కోణంలో చూడడంలేదు, ఎలాంటి వివక్ష చూపించడంలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసులు గెలవండి. 

రాజకీయనేతలకు ఐదేళ్లే కాలపరిమితి, మీకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుంది. అన్ని సంవత్సరాల సర్వీసును మీకందిస్తున్నారంటే, మీరు ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించాలో అర్థం చేసుకోండి. 

కొంతమంది అధికారులు బదిలీ అయి వెళ్లిపోతున్నప్పుడు ప్రజలు సన్మానం చేయడం చూస్తుంటాం… ఓ మంచి అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తోందని కన్నీరు పెట్టుకుంటారు. మీరు కూడా ప్రజల్లో నమ్మకం పొందేలా పనిచేయండి. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బాధ్యతతో మెలగండి” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts

 పౌరసరఫరాలశాఖ రూ. 56 వేల కోట్ల నష్టంలో ఉంది..మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…

Ram Narayana

నిజామాబాద్ జిల్లాలో ఘోరం… ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

Ram Narayana

మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడటం విడ్డురం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment