Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటె సోనియా గాంధీపై పోటీ పెట్టవద్దు …డీప్యూటీసీఎం భట్టి ..!

“తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మన రాష్ట్రం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కోరాం…సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాలని” డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు … డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఆదివారం స్వగ్రామం వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి వచ్చిన భట్టి విక్రమార్క దంపతులకు గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు …

వారు ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు .. వారి వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న బట్టి విక్రమార్క తల్లిదండ్రులైన అఖిలాండ దాసు, మాణిక్యమ్మల ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు….

అంతకు ముందు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో భట్టి దంపతులు శివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు… ఆలయం విస్తరణ కోసం దేవాదాయ ధర్మా దాయశాఖ అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం చర్చించారు. గుడి బయట కళ్యాణమండపం డార్మెంటరీ స్నానాల ఘట్టం నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు… అనంతరం స్థానిక విలేకరులతో 30 రోజులు పూర్తి చేసుకున్న ప్రజాపాలన గురించి ఆయన మాట్లాడారు.

బిఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ప్రతిసారి వ్యాఖ్యలు చేశారు…కాలేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మోడీ, అమిత్ షా లు మాట్లాడిన వారు కాలేశ్వరం దోపిడి గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ కేంద్రంలోని బిజెపి కుమ్మకు కావడం వల్లనే కాలేశ్వరం పై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన దోపిడి గురించి సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర బిజెపి నాయకులు వారి కేంద్ర నాయకత్వానికి ఆ విషయమే చెప్పాలని అన్నారు. కేంద్రంలో ఉన్న సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలు ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తాయి కాబట్టి తాము సిబిఐ విచారణకు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అన్ని విషయాలు రాష్ట్ర బిజెపి నాయకులకు తెలిసినప్పటికీ
బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని చురకలు వేశారు…

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం ఏమైందని వీటిపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని భట్టి డిమాండ్ చేశారు. మోసం మోసమని బతికే బిజెపి లాగా కాంగ్రెస్ వ్యవహరించదని అన్నారు.

రాష్ట్రంలో చిన్న భిన్నంగా ఉన్న పాలన వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారి పాలన అందిస్తున్నామని చెప్పారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులు 21వ తారీకు వరకు జీతాలు తీసుకున్న దుస్థితి నుంచి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే ఆర్థిక స్థితికి మెరుగు పరిచామన్నారు…గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకత్వంపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు ఆర్థిక పరిస్థితులపై వాస్తవాలు చెప్పామని వివరించారు.
విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా జెన్కో, ట్రాన్స్ కో, డిస్కోలో ఉన్న అప్పులను బయట పెట్టడంతో పాటు వ్యవసాయ శాఖలో సమీక్ష చేసి ప్రజలకు జవాబుదారీగా భూసార పరీక్షలు పెంచి రైతులకు అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉండే విధంగా సమయాత్తం చేశామన్నారు.

మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారవుతున్నదని త్వరలో బయట పెడతామని వెల్లడించారు…పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రజలకు అతి పెద్ద సవాల్ గా మారిన డ్రగ్స్ నిరోధానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆ శాఖకు కావాల్సిన నిధులను మంజూరు చేశామని తెలిపారు…

6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 6.50 కోట్ల మహిళలకు లబ్ధి కలిగించామని చెప్పారు…ఆరోగ్య శ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యా, వైద్య ఉపాధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రణాళిక సంఘాన్ని తిరిగి పునరుద్ధరణ చేసి, ఆ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించాని చెప్పారు….ఆర్దిక వనరులను సక్రమంగా ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే వెచ్చిస్తామన్నారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని,
పైరవీలు, ప్రశ్న పత్రాలు లీకు కాకుండా పకడ్బందీగా టిఎస్పిఎస్సి ద్వారా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు….నిరుద్యోగ యువతకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ రంగంపై లోతైన అధ్యయనం చేసి ఇంక్లూసివ్ గ్రోత్లోకి ప్రజలను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని తెలిపారు….రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ, స్వతంత్రం , ఒత్తిడి లేని పాలన అందిస్తామని చెప్పినట్టుగానే చేస్తున్నామని తెలిపారు… శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యవహరించడమే కాకుండా ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి అందుకు తగ్గట్టుగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు…పైరవీకారులు, తాబేదారులకు తావు లేకుండా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా 30 రోజులు ప్రజాపాలన అందించిందని వెల్లడించారు…

ప్రజలు ఇచ్చిన ఈ పదవులను హోదా గా కాకుండా బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన అందిస్తున్నట్లు చెప్పారు…ఆరు గ్యారెంటీల హామీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించామన్నారు…రాష్ట్రంలో విద్యా, వైద్యం బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామని, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యార్థులందరికీ ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా వృత్తిపరమైన కోర్సులు తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు …

Deputy CM Bhatti Vikramarka appealed to “Sonia Gandhi, who was given by the state of Telangana, to contest for Parliament from our state… No party who has real love for Telangana should contest from the seat of Parliament where Sonia Gandhi is contesting” Deputy CM Bhatti Vikramarka… Bhatti Vikramarka couple who came to Swagramam Vaira Mandal Snanala Lakshmipuram village for the first time on Sunday were warmly welcomed by the villagers…they moved forward with greetings from the people..Battiti Vikramarka’s parents, Akhilanda Dasu, who were at their farm, paid their respects by offering flowers at Manikyammala Ghat…. The Bhatti couple offered special pooja to Lord Shiva in the Sri Ramalingeshwar temple in the village before… The Deputy CM discussed with the officials of the Devadaya Dharma charity department for the expansion of the temple. He gave instructions to the officials to prepare estimates for the construction of the Kalyanamandapam Dormitory bathhouse outside the temple… He then spoke to the local reporters about the 30 days of public administration.

Every time Prime Minister Modi and Home Minister Amit Shah came to Telangana, they said that Kaleswaram has become like an ATM for the BRS party.
According to the information given by the central investigation agencies and agencies that looting took place in the construction of Kaleshwaram, Modi and Amit Shah spoke and questioned why they are not taking action even though they have full information about the Kaleshwaram looting. They said that the central government is acting indifferently on Kaleswaram because of the BJP’s involvement in the BRS center of the state. The state BJP leaders, who are demanding a CBI inquiry into the looting of the Kaleswaram project, said the same should be told to their central leadership. CBI and other investigative agencies at the Center are working under Prime Minister Modi and Home Minister Amit Shah, so they are preparing to conduct an investigation by a sitting judge instead of a CBI investigation. Although all the matters are known to state BJP leaders
They said that it is not appropriate to speak like a mouth without responsibility…

Bhatti demanded the Center to answer about two crore jobs per year, 15 lakh cash deposit in each bank account, what happened to the black money that was supposed to be taken out during demonetisation. He said that Congress will not act like BJP which lives on fraud.

He said that the governance system in the state, which is slightly different, is being put in the groove and accountable governance is being provided. He said that from the situation where employees received their salaries till the 21st day from the last five years, the financial condition has been improved to that of giving salaries in the first week.
He said that besides releasing the debts of power generation and supply, Genco, Trans Co and DISCO, the Department of Agriculture has reviewed and increased soil tests to be accountable to the people and time has been taken so that the authorities are available to the farmers.

He revealed that a report is being prepared on the irregularities in Mission Bhagiratha and will be released soon… He said that the police system has been cleansed and a strong system has been set up to prevent drugs which has become the biggest challenge for the people of the state and financial assistance has been provided and the necessary funds have been granted to that department…

He said that as part of 6 guarantees, free RTC bus travel has been started in Mahalakshmi scheme and so far 6.50 crore women have benefited. He said that plans are being prepared for education and medical employment, the planning committee which was defunct by the BRS government has been revived and a senior IAS officer has been appointed as the secretary of that department….The financial resources will be properly planned and spent for the future of the people of the state.

Investments are invited for the establishment of large-scale industries in the state.
He said that steps have been taken to conduct the examinations by TSPSC in an armed manner and not to leak question papers…. He said that all arrangements are being made to prepare for the competitive examinations in accordance with the job calendar announced for the unemployed youth. He said that after a deep study on the welfare sector, the Congress government is preparing plans to bring the people to inclusive growth. Acknowledge the responsibility and act accordingly

Related posts

 ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే: రేవంత్ రెడ్డి

Ram Narayana

ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

 మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణం: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment