ఐక్యంగా పని చేద్దాం..పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిద్దాం …ఎంపీ నామ
తెలంగాణ సమగ్రాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం…
ప్రజా తీర్పును గౌరవిద్దాం…ఎంపీ ఎన్నికలలో సత్తా చాటుదాం
కేటీఆర్ ఆధ్వరంలో జరిగిన ఖమ్మం పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశం
అనంతరం మీడియా సమావేశంలో ఖమ్మం ఎంపీ నామ
ఐక్యంగా పనిచేద్దాం … పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిద్దామని ఖమ్మం ఎంపీ లోకసభలో బీఆర్ యస్ పక్షనేత నామ నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు …ఖమ్మం పార్లమెంట్ స్థాయిసమీక్ష సమావేశం మంగళవారం తెలంగాణ భవనంలో కేటీఆర్ ఆధ్వరంలో జరిగింది….ఈ సమావేశానికి నామాతోపాటు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డి , మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు … అనంతరం మీడియా సమావేశంలో నామ మాట్లాడుతూ … ఖమ్మం జిల్లాలో ముఖ్య నాయకత్వం వేదిక మీద ఉన్న పెద్దలు అందరం పార్లమెంటరీ స్థాయి పార్టీ సమీక్ష చేసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా గత పదేండ్ల నుండి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఎప్పుడూ లేని విధంగా భారత దేశంలో నే తెలంగాణ పటాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ని ముందుకు తీసుకుపోయిన నాయకుడు కెసిఆర్ మాత్రమే నని అన్నారు.
ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం.. మీరు మానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలు గురించి మీకు మీరే ఉలిక్కిపడుతున్నారు… 30, 40 రోజులు కాలేదు అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటలు మీ మంత్రులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ను విమర్శించారు. మీరు చెప్పిందే కదా పెన్షన్ తీసుకోవొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి రాగానే డిసెంబర్ 9 నుండి పెంచిన పెన్షన్ నాలుగు ఇస్తామన్నారు. అలాగే రైతు భరోసా కింద పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తాము అన్నది మీరు.. అదే మేము గుర్తు చేస్తే మీరు ఉలిక్కి పడుతున్నారెందుకు అని నామ ప్రశ్నించారు. ఇవన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయిని, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం వున్నదని అందుకే పార్లమెంట్ ఎన్నికల వరకు అప్లికేషన్స్ అనే మాట చెబుతూ కాలం వెళ్లదీస్తూ తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అన్ని అడ్డు చెప్పి తప్పించుకునేలా కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఎంపీ నామ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అటు లోక్ సభ, రాజ్యసభలో బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ సమస్యలు, రావాల్సిని నిధులు గురించి గళమెత్తిన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఉభయ సభల్లో అత్యధిక ప్రశ్నలు వేసింది బి.ఆర్.ఎస్ ఎంపీలు మాత్రమే అన్నారు. ప్రతి సమస్యను పార్లమెంట్ లో లేవనెత్తిన ఘనత బిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులది అన్నారు. కేంద్రం లో ఒకరు అధికారంలో వున్నారు, మరొకరు ప్రతిపక్ష నాయకులు గా వున్నారు. ఈ రెండు పార్టీలు ఏ రోజు కూడా తెలంగాణ సమస్యలు గురించి పట్టించుకోలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినిపించాలన్నా, తెలంగాణ సమస్యలు గురించి పోరాడాలన్నా తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎవరు నిలబడినా ఆ ఎంపీలు లను అత్యధిక మెజారిటీ లో గెలిపించాలన్నారు. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించడమే కాకుండా స్థానిక సంస్థ అన్ని ఎన్నికల్లో పెద్ద ఎత్తున్న బిఆర్ఎస్ పార్టీని గెలిపించారని, అదే విధంగా రాబోయే సమయంలో బిఆర్ఎస్ పార్టీ ని ఆశ్వీరదించాలని నామ పిలుపునిచ్చారు.
ఈ విలేఖరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్ఛా నాగేశ్వరరావు, బానోత్ మదన్ లాల్, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం ,ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మాజీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.