Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు

  • లక్షద్వీప్-మాల్దీవుల అంశంపై మోదీకి విశేష రీతిలో మద్దతు
  • ప్రధాని వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఖర్గే
  • 2014 నుంచి మోదీ తీరు ఇలాగే ఉందని విమర్శలు
  • పొరుగుదేశాలతో సఖ్యత అవసరమని హితవు

లక్షద్వీప్-మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని ప్రతి అంశంలోనూ పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీది ఇదే వరస… వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడమే ఆయన అజెండా అని పేర్కొన్నారు. 

భారత్ కు ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత అవసరం అని ఖర్గే స్పష్టం చేశారు. కాలానుగుణంగా మనం మారాలే తప్ప, మనకు నచ్చలేదని పొరుగు దేశాలను మార్చుకోలేం కదా? అని హితవు పలికారు. నాడు బంగ్లాదేశ్ విమోచన నేపథ్యంలో పరిస్థితులు ఎంతో దిగజారిన మీదటే భారత్ పొరుగున ఉన్న పాకిస్థాన్ తో పోరాడిందని ఖర్గే వివరించారు.

Maldives President urges China to float tourists towards his country

లక్షద్వీప్ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు నోరు పారేసుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారంతో భారతీయుల్లో ఆగ్రహాశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే ఆ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల్లో కోపం చల్లారడంలేదు. 

ఈ క్రమంలో…  ప్రధానంగా టూరిజంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాల్దీవులను భారత టూరిస్టులు బాయ్ కాట్ చేశారు. ఈ పరిణామంతో మాల్దీవుల ప్రభుత్వం కంగుతింది. మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో అత్యధికులు భారతీయులే. ఇప్పుడు భారతీయులు రాకపోవడంతో గత కొన్నిరోజులుగా మాల్దీవుల టూరిజం మందగించింది. 

ఈ నేపథ్యంలో, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా సాయం కోరుతున్నారు. తమ దేశానికి అధిక సంఖ్యలో టూరిస్టులను పంపాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని అర్థించారు. 

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు చైనా అనుకూల నేత అనే ముద్ర ఉంది. ప్రస్తుతం ఆయన ఐదు రోజుల పర్యటన నిమిత్తం చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు ఇవాళ రెండో రోజు కాగా, ఫ్యుజియాన్ ప్రావిన్స్ లో నిర్వహించిన మాల్దీవుల బిజినెస్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చైనా తమకు అత్యంత సన్నిహిత దేశం అని కీర్తించారు. అభివృద్ధిలో తమకు భాగస్వామి అని కొనియాడారు. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ 2014లో ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ పథకం (బీఆర్ఐ) భేష్ అంటూ ప్రస్తుతించారు. మాల్దీవుల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా చలవేనని అన్నారు. కొవిడ్ సంక్షోభానికి ముందు చైనా తమకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని, ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాల్సిందిగా చైనాను కోరుతున్నామని ముయిజ్జు పేర్కొన్నారు.

కాగా, ముయిజ్జు పర్యటన నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు.. ఇరుదేశాల మధ్య 50 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదిరిందని మాల్దీవుల మీడియా తెలిపింది.

Related posts

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. ఈ నెల 16, 17న హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాటు

Ram Narayana

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు బీజేపీకి షాక్‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ మాజీ సీఏం

Ram Narayana

సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్‌గిరి నుంచి సునీత… కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Ram Narayana

Leave a Comment