Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

  • ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్
  • మూడున్నర గంటల పాటు సమావేశం
  • ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ
  • 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు
  • ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 

కాగా, ఈ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. 12 అంశాలతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. 

టీడీపీ ఇప్పటికే ‘సూపర్ సిక్స్’ పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించగా, ఇప్పుడు వాటికి జనసేన ‘షణ్ముఖ వ్యూహం’ మరో ఆరు అంశాలను జోడించింది. ఈ నెలలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పొత్తులో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Related posts

175 ఎమ్మెల్యే ,24 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. బీసీలకు పెద్ద పీట…

Ram Narayana

రాజంపేటలో మిథున్ ,కిరణ్ కుమార్ రెడ్డి లమధ్య మాటల యుద్ధం….

Ram Narayana

వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

Ram Narayana

Leave a Comment