Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యంతెలంగాణ వార్తలు

గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …

ఐదు రోజుల క్రితం అస్వస్థకు గురై నాలుగురోజులుగా హైద్రాబాద్ లోని గచ్చిబోలి హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పెద్ద గండం నుంచి గట్టెక్కారు … ఇందుకు ఆయన విల్ పవర్ తోపాటు డాక్టర్లు అందించిన వైద్యమనే చెప్పాలి … శనివారం ఉదయం ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించడంతో కుటుంబసభ్యులు , పార్టీ నాయకులూ , కార్యకర్తలు , శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు …శుక్రవారమే ఆయన ఆహారం తీసుకోవడం ఊరట కలిగించింది …గుండె , లివర్ ,కిడ్నీ సమస్యలతో భాదపడుతూ మొదట ఖమ్మం హాస్పటల్ లో చేరిన తమ్మినేని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు …ఆయన్ను ఖమ్మం నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో పోలీస్ ఎస్కార్ట్ తో హైదరాబాద్ తరలించేందుకు రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరావు చొరవ చూపగా , తమ్మినేని వచ్చిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు అదే రోజు రాత్రి హుటాహుటిన హాస్పటల్ కు వచ్చి డాక్టర్లతో మాట్లాడు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని తమ్మినేని సతీమణి ఉమా అన్నారు ..వారి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు …మొదటి రోజు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి డాక్టర్లు సోమరాజు , డి ఎన్ కుమార్ పర్వేక్షణలో 24 గంటలు ప్రత్యేక డాక్టర్ల బృందం వైద్య సేవలు అందించింది …దీంతో ఆయన త్వరగా కోలుకున్నారు …మొదట మూడు ,నాలుగు రోజులు వెంటిలేటర్ సహాయంతో ఉన్న తమ్మినేనికి పూర్తిగా దాన్ని తొలగించారు …ఇప్పుడు మామూలుగానే గాలి పీల్చుకుంటున్నారు …భోజనం చేస్తున్నారు …

శనివారం ఉదయం ఆయన్ను పరామర్శించేందుకు హాస్పటల్ కు వెళ్లిన మాజీమంత్రి పువ్వాడ అజయ్ తో చిరునవ్వుతో మాట్లాడరు …ఆయన హాస్పటల్ లో చేరిన దగ్గర నుంచి సతీమణి ఉమా,కుమారుడు మిత్రా ,ఇతర కుటుంబసభ్యులు పార్టీ నాయకులు బి .వెంకట్, పోతినేని సుదర్శన్,అన్నవరపు కనకయ్య ,బండి రమేష్, హాస్పటల్ వద్దే ఉంటున్నారు ..

ప్రముఖుల పరామర్శ …

హాస్పటల్ లో ఉన్న తమ్మినేనిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి , సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు , ఏపీ సిపిఎం కార్యదర్శి వి .శ్రీనివాస్ రావు , సిపిఎం రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య , జూలకంటి రంగారెడ్డి , చెరుపల్లి సీతారాములు, నాగయ్య ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు …

సీఎంఓ ఆఫీస్ ఆరా …

సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం తమ్మినేని ఆరోగ్యంపై ఆరా తీసింది ….రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయన్ను పరామర్శించే అవకాశం ఉంది … పార్టీ నాయకులు ,కార్యకర్తలు , ఇతర ప్రముఖులు ,వివిధ పార్టీలకు చెందిన వారు తమ్మినేని ఆరోగ్యంపై ఎప్పటికప్పడు తెలుసు కుంటున్నారు ….

Related posts

నావృత్తి వ్యవసాయం నాకు ఇదే శాఖ కేటాయించడం సంతోషం :తుమ్మల

Ram Narayana

స్టీల్ పాత్రల్లో వండుతున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త!

Ram Narayana

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం!

Ram Narayana

Leave a Comment