Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన కొణతాల రామకృష్ణ

  • 2014 నుంచి వైసీపీకి దూరంగా కొణతాల రామకృష్ణ
  • ఇటీవల హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో సమావేశం
  • నేడు అనకాపల్లిలో తనవారితో సమావేశం
  • జనసేనతో కలిసి నడవాలనుకుంటున్నట్టు వెల్లడి

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుడైన కొణతాల రామకృష్ణ… 2014 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నిరోజుల కిందటే హైదరాబాదు వెళ్లి జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. జనవరి 21న అనకాపల్లిలో తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, తదితరులతో చర్చించి తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని వెల్లడించారు. 

చెప్పినట్టుగానే కొణతాల ఇవాళ తనవారితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ ఈ దిశగా రాజీలేని పోరాటం చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపారు. పవన్ కు ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు.

Related posts

చంద్రబాబు, నారా లోకేశ్ నాకు ఓటు వేయడం గర్వంగా ఉంది: ఆలపాటి రాజా

Ram Narayana

వైసీపీకి అవంతి ,గ్రంధి గుడ్ బై …జగన్ తప్పులపై గళం విప్పుతున్న నేతలు …

Ram Narayana

టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని గుడ్ బై …వైసీపీలో చేరతానని వెల్లడి …

Ram Narayana

Leave a Comment