నేడే సార్వత్రిక ఎన్నికల షడ్యూల్…
ఏపీ తోసహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం
7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం
మొదటి దశలోనే ఏపీ తెలంగాణ ఎన్నికలు
18 వ లోకసభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది …ఇక షడ్యూల్ ప్రకటించడమే తరువాయి …దానికోసం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు …ఎన్నికల నగర మోగనుండటంతో వివిధరాష్ట్రాల్లో పాలక పార్టీలు ఈరోజు మధ్యాహ్నం తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నందున శంకుస్థాపనలు ,ప్రారంబోత్సవాలు ముమ్మరం చేశారు …ఆంధ్రప్రదేశ్ తోసహా ఐదు రాష్ట్ర శాసనసభలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నందున వాటిని కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు ప్రకటించనున్నారు …17 లోకసభకు 7 దశల్లో ఎన్నికలు జరిగినందున ఈసారికూడా అదే విధంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయపార్టీలు భావిస్తున్నాయి…ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సమాయత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి…
ఈసారి ఎన్నికల్లో సుమారు 100 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది …ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్ లో ఓటర్లు ఉన్నారు …దీంతో ఎన్నికల నిర్వహణకోసం సిబ్బంది నియామకం , భద్రతా చర్యలకోసం పోలీస్ ,భద్రతా దళాల సహాయం తీసుకోనున్నారు …దేశంలోని అధికార యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లనున్నది …