Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై సోనియా , ఖర్గే , రాహుల్ భగ్గు ,భగ్గు

తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై సోనియా , ఖర్గే , రాహుల్ భగ్గు ,భగ్గు
ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించిన సోనియా
ఇది ముమ్మాటికీ నిరంకుశమే అన్న ఖర్గే
మా నేతలను ప్రచారానికి ఎక్కడకూ పంపించలేకపోతున్నాం… రైలు టిక్కెట్‌కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై మాట్లాడిన రాహుల్ గాంధీ
ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామని వెల్లడి
ఈరోజుల్లో బ్యాంకు ఖాతాలు పని చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య

ఎన్నికల వేళ తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరిపై భగ్గు భగ్గుమన్నారు ..ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా సోనియా అభివర్ణించగా , ఇది ముమ్మాటికీ నిరంకుశమేనని మల్లిఖార్జున ఖర్గే అన్నారు … కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కసారిగా మీడియా సమావేశంలో పాల్గొనడం అరుదు …కానీ తప్పని పరిస్థిల్లో పాల్గొన్నట్లు వారు తెలిపారు ..

ఎన్నికల ప్రచార సమయంలో మా నేతలను ఎక్కడకూ పంపించలేకపోతున్నాం… విమాన ప్రయాణాలను పక్కన పెట్టాం… కనీసం రైలు టిక్కెట్లు కొనడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై ఆయన మాట్లాడుతూ… తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు.

తమ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాల్పడుతున్న నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారన్నారు. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజుల్లో బ్యాంకు ఖాతాలు పని చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అన్నారు. తాము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడమంటే భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందన్నారు.

ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు అబద్దంగా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలో 20 శాతం మంది ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో పోరాడకుండా తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు.

Related posts

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచేస్తుంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా వెలిసిన పోస్టర్లు…

Ram Narayana

ఢిల్లీలో నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియం పేరు మార్పు

Ram Narayana

Leave a Comment