- మద్యం కేసులో జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
- కేజ్రీవాల్ పంపించే సందేశాలను పార్టీకి వినిపిస్తున్న సునీతా కేజ్రీవాల్
- పార్టీని ఐక్యంగా ఉంచడానికి ఆమె బెస్ట్ అన్న మంత్రి సౌరబ్ భరద్వాజ్
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బెస్ట్ పర్సన్ అని మంత్రి సౌరబ్ భరద్వాజ్ అన్నారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన జైలు నుంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తే సీఎం ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో సౌరబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీతా తనను తాను ఢిల్లీ సీఎం మెసెంజర్‌గా చెబుతుంటారన్నారు.
కేజ్రీవాల్ పంపించే సందేశాలను ఆమె వినిపిస్తుంటారని, ఇది పార్టీ కార్యకర్తలు, తమ మద్దతుదారులపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచడానికి ఆమె బెస్ట్ పర్సన్ అని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు. అయితే ప్రచారంలో పాల్గొనాలా? వద్దా? అనేది ఆమె నిర్ణయం అన్నారు.