Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

అమెరికా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు…

  • 793 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 234 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పతనమైన సన్ ఫార్మా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికాలో అంచనాలకు మించి ద్రవ్యోల్బణం నమోదు కావడంతో… కీలక వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 793 పాయింట్లు కోల్పోయి 74,244కి పడిపోయింది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 22,519కి దిగజారింది. ఈరోజు దాదాపు అన్ని సూచీలు నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (0.67%), టీసీఎస్ (0.45%), నెస్లే ఇండియా (0.37%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-4.01%), మారుతి (-3.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.57%), టైటాన్ (-2.40%), జేఎస్ డబ్లూ స్టీల్ (-2.22%).   

Related posts

బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

Ram Narayana

సేవింగ్ అకౌంట్‌లో గరిష్ఠంగా ఎంత డబ్బు ఉండొచ్చు?.. ట్యాక్స్ రూల్స్ ఏంటి?

Ram Narayana

భార‌తీయుల‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంప‌రాఫ‌ర్‌.. విమాన టికెట్ల‌పై 30 శాతం డిస్కౌంట్‌!

Ram Narayana

Leave a Comment