Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలుక్రైమ్ వార్తలు

సీఎం జగన్ పై రాళ్ల దాడి… ఎడమ కంటి వద్ద గాయం…

  • విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • సింగ్ నగర్ వద్ద రాయి విసిరిన ఆగంతుకుడు
  • కంటి పైభాగాన బలంగా తాకిన రాయి
  • వెంటనే చికిత్స చేసిన వైద్య సిబ్బంది

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న స్కూలు భవనం పై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. 

కాగా, క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు స్కూలు భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్డులో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. 

సీఎం జగన్  పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైనట్టు తెలుస్తోంది.

జగన్ పై విజయవాడ లో దాడి వార్త తో రాష్ట్ర వ్యాపితంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి…ఈదాడికి చంద్రబాబు అండ్ కో అంటూ దుమ్మెత్తి పోశాయి….జగన్ కు ప్రజల నుంచి వస్తున్నా ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు కుట్ర పూరితంగా జగన్ పై దాడి చేశయించారని పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు …దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ….విశాఖ , గుంటూరు , తిరుపతి , నెల్లూరు , కర్నూల్ , ప్రకాశం విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , శ్రీకాకుళం , విజయనగరం చిత్తూరు , జిల్లాల్లో రాష్ట్ర పొద్దుపోయిన తర్వాత వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై వచ్చి నిరసనలు తెలిపారు …

ఈదాడిని జరిపిన వారిని జరిపించిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలియపరు …జగన్ మేమంతా సిద్ధం సభలో విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి సెంటర్ లో ఈ ఘటన జరిగింది …జగన్ ప్రజలకు అభివాదం జరుపుతుండగా ఆయనకు ఎడమ పక్క నుంచి వచ్చిన రాయి నుదుటిపై భాగంలో జరిగింది …దీంతో రక్త స్రావం అయింది .వెంటనే డాక్టర్లు ప్రధమ చికిత్స చేశారు .తరువాత ఆయన తన యాత్ర ను యధావిధిగా కొనసాగించారు ..

Related posts

వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్యే దొరబాబు?

Ram Narayana

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు!

Drukpadam

చంద్రబాబుతో ముగిసిన ప్రశాంత్ కిశోర్ సమావేశం… వైసీపీ సర్కారుపై లోతైన విశ్లేషణతో నివేదిక!

Ram Narayana

Leave a Comment