Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

బీఆర్ యస్ అవినీతి పార్టీ …దాని అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ …జెపి నడ్డా ధ్వజం…

తెలంగాణాలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ అవినీతి పార్టీ అని అందుకే దాన్ని ప్రజలు ఇంటికి పంపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తారు ..దాని అడుగుజాడల్లోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు … కొత్తగూడెంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రలో బీజేపీకి మంచి ఆదరణ ఉందని, దేశంలో తిరిగి మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు …అన్ని రంగాల్లో దేశం ప్రపంచంలో మంచి స్థానంలో ఉందని పేర్కొన్నారు …ఒకప్పుడు మన చేతుల్లో ఉండే సెల్ ఫోన్లు చైనా , జపాన్ కొరియా , తైవాన్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే వరమని నేడు మీరు చుడండి మేడ్ ఇన్ ఇండియా అని ఉంటాయని అన్నారు …ఫార్మా రంగంలో ప్రపంచంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించామని అన్నారు.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని మరి కొద్దీ కాలంలో అగ్రదేశాల సరసన చేరుతామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు …

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, శతాబ్దాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. విపరీతమైన ఎండలోనూ సభకు జనం తరలి వచ్చారన్నారు. మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గాల నుంచి సీతారాం నాయక్, వినోద్ రావులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలహీనమైనదని విమర్శించారు. యూపీఏ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలే ఉండేవని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 11వ స్థానంలో మన దేశాన్ని మోదీ 5వ స్థానానికి తీసుకువచ్చారన్నారు.

Related posts

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

Ram Narayana

కుల గణన నుంచి దృష్టి మళ్లించడానికే మహిళా బిల్లును తీసుకువచ్చారు: రాహుల్ గాంధీ

Ram Narayana

కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

Ram Narayana

Leave a Comment