Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

కేంద్రంలో సంకీర్ణమే …రాష్ట్రంలో బీఆర్ యస్ 12 సీట్లు గెలవబోతుంది…కేసీఆర్

ఈసారి ఆరునూరైనా కేంద్రంలోనే సంకీర్ణమే అని మాజీ ముఖ్యమంత్రి ,బీఆర్ యస్ అధినేత కేసీఆర్ అన్నారు …బీజేపీకి 200 సీట్లు లోపే వస్తాయని పేర్కొన్నారు ..తమ పార్టీకి తెలంగాణాలో 12 సీట్లు గెలవబోతుందని స్పష్టం చేశారు …ఖమ్మంలో పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఖమ్మం వచ్చిన కేసీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది ….కాల్వ ఒడ్డు నుంచి మయూరి సెంటర్ , బస్సు స్టాండ్ ,వైరా రోడ్ మీదగా అంబేద్కర్ సెంటర్ లో వరకు రోడ్ షోలో కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ పాల్గొన్నారు …అంబేద్కర్ సెంటర్లో ప్రజల నుద్దేశించి ప్రసంగించారు …

గోదావరి జలాలను ప్రధాని మోడీ తమిళనాడు , కర్ణాటక తరలించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దద్దమ్మల్లా నోరుమూసుకున్నారని దుయ్యబట్టారు …రాష్ట్రంలో కరెంటు కోతల గురించి నేను ట్విట్ చేస్తే విద్యత్ మంత్రి భట్టి విక్రమార్క కాదు కాదు వట్టి విక్రమార్క నేను అబద్దలు ఆడుతున్నానని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు …

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో నీళ్ల కరవు ,కరెంటు కోతలు నిత్యకృత్యమైయ్యని విమర్శలు గుప్పించారు …రైతు బందు లేదు …నీళ్లకోసం కొట్లాటలు , కరెంటు కోతలు ,కళ్యాణి లక్ష్మి లేదు ..తులం బంగారం ఊసే లేదు …ప్రజల బాగుకోసం తమ ప్రభుత్వంలో అమలు జరిపిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా చేసి అడిగితే కస్సు బుస్సు మంటున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అన్నారు .అందుకు ప్రజల మద్దతు కావాలన్నారు …రానున్న లోకసభ ఎన్నికల్లో బీఆర్ యస్ మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రభుత్వంపై మీకున్న కసిని తెలియజేసే అవకాశం ఉందని అన్నారు …

హరీశ్ రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి తోక ముడిచారు: కేసీఆర్

మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ప్రజలు సంక్షేమ ఫలాలు అందాయని , కీలో రెండు రూపాయల బియ్యం జనతా వస్త్రాలు ,రైతుల శిస్తు రద్దు, పక్కా గృహాలు , ఇచ్చిన ఘనత అయినదే అని అన్నారు .రేవంత్ రెడ్డి మాత్రం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు …

ఖమ్మం లోకసభకు బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ పార్లమెంట్ లో రైతుల ధాన్యం కొంగలు కోసం గిట్టుబాటు ధరల కోసం గట్టిగ కొట్లాడారు … జిల్లాలో భక్త రామదాసు నిర్మించాం … 37 టీఎంసీల నీటిని తరలించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తీ కావాలి .. జిల్లాను అభివృద్ధి చేయాలనే తపన ఉన్నవాడు ఆయన్ను గెలిపించండి …కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో కేంద్రమంత్రిని చేస్తానని సభికుల హర్షద్వానాల మధ్య కేసీఆర్ ప్రకటించారు … అంతకు ముందు నామ ప్రసంగించారు …కార్యక్రంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు ,మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి , బానోత్ మదన్ లాల్ , ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ పూనుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు …

Related posts

కింగ్ మేకర్ అయితే బీహార్ కు ప్రత్యేక హోదా అడగాలి: తేజస్వీ యాదవ్

Ram Narayana

బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు …

Ram Narayana

నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను: తెలంగాణలో ప్రధాని మోదీ…

Ram Narayana

Leave a Comment