Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి…

  • రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
  • సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను వరించిన అవార్డు
  • వేడుక‌లో పాల్గొన్న చిరంజీవి భార్య సురేఖ‌, త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుక‌లో చిరంజీవి భార్య సురేఖ‌తో పాటు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాసన కూడా పాల్గొన్నారు. 

Related posts

భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తిరుగుబాటుదారుల మృతి

Ram Narayana

300 మంది తాగుబోతు పోలీసులకు వీఆర్ఎస్ ఇచ్చిన అసోం ప్రభుత్వం!

Drukpadam

బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

Ram Narayana

Leave a Comment