మంచుకొండ రోడ్డు షోలో నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర
పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ ను తరిమికొట్టి, కారు గుర్తుకు ఓటేసి తనను మంచి మెజార్టీతో గెలిపించాలని
బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు …గురువారం రాత్రి రఘునాధపాలెం మండలం మండలం మంచుకొండ లో జరిగిన భారీ రోడ్ షో కు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు .
తప్పుడు వాగ్దానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే భ్రమలు కల్పించి
గెలవాలని చూస్తుందని అన్నారు .కాంగ్రెస్ కుయుక్తులనుప్రజలు తిప్పికొట్టాలని అన్నారు .రెండు సార్లు గెలిపించి పార్లమెంటుకు పంపితే విభజన ప్రాజెక్టులకు నిధులు అనేక సమస్యలు, ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర సమస్యలపైన పార్లమెంటు లోపల, బయట పోరాడానని చెప్పారు. రైతు సమస్యలపై పార్లమెంటును స్తంభింపజేసి, బయట ధర్నాలు చేశామని చెప్పారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి, కెసిఆర్ కు మద్దతుగా నిలవాలని అన్నారు …తనను గెలిపిస్తే పార్లమెంట్ కు వెళ్లి జిల్లా గొంతుకనై ఉద్యమిస్తామని , కార్యకర్తలకు అండగా ఉండి తన సత్తా చూపిస్తానని అన్నారు.వాగ్దానాల ద్వారా బాకీ పడ్డ కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలకు భవిష్యత్ ఉండదన్నారు. కరెంట్ కోతలు, సాగు, తాగు నీరు లేక ప్రజలు అల్లాడి పోతున్నారని అన్నారు. మళ్లీ రాష్ట్రం పురోగంలో పాయనించాలంటే ఈ ఎన్నికల్లో చరిత్రను తిరగరాయలని అన్నారు. విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించి ఓటు వేసి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ
పక్కా లోకల్ గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రజలతో మమేకమై ఉన్న నామ నాగేశ్వరావును మంచి మెజారిటీతో గెలిపించుకొని మళ్లీ పార్లమెంటు పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైనా ఉందని అన్నారు.కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు పై కాంగ్రెస్ ను నిలదీసి, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అన్నారు. నామ గెలిస్తే నిత్యం ప్రజల మద్యే ఉండి, ఏ కష్టమొచ్చినా అడుకుంటారని అన్నారు.కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు నమ్మి మళ్లీ మోసపోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు ,వీరు నాయ, శంకర్ , హరిప్రసాద్,వెంకటరమణ , పిన్ని కోటేశ్వరరావు, గుత్తా రవి, లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి …ఎంపీ వద్దిరాజు
సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోక చాలా పొరపాటు చేసినం
కాంగ్రెస్ హామీలకు ఆశపడి అనవసరంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నం
ఆ పొరపాటును,తప్పును సరిదిద్దుకునే మంచి అవకాశం దొరికింది
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఎన్నికల్లో నామ నాగేశ్వరరావును మనమందరం సైనికుల మాదిరిగా కష్టించి గెలిపించుకోవాలి
తద్వారా కేసీఆర్ నాయకత్వం మరింత బలోపేతం అవుతుంది
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పాత్ర పోషించిన నాగేశ్వరరావు మళ్లీ మన హక్కుల కోసం పార్లమెంటులో కొట్లాడుతరు