Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుంది: మల్లు భట్టివిక్రమార్క

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ , రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు స్వ గ్రామమైన మంథని మండలం ధన్వాడలో వివిధ దేవాలయాల మూడో వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు.


మిత్రుడు శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ధన్వాడలో పర్యటనతో ఈరోజు ధన్యమైందని డిప్యూటీ సీఎం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సాధారణ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎండ వేడిని లెక్కచేయకుండా తీవ్రంగా శ్రమించారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, దేశ సంపదను, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎన్నికల్లో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ప్రపంచంలో అతిపెద్ద లౌకికదేశంగా భారతదేశ అన్ని నిలబెట్టేందుకు యువ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని ఆయన వివరించారు.
ఎన్నికల ఫలితాల తదుపరి రాహుల్ గాంధీ సుదీర్ఘ పోరాట ఫలితాలు కనిపిస్తాయి అన్నారు

Related posts

మల్కాజ్‌గిరిలో నా గెలుపు… తెలంగాణకు సీఎం స్థాయికి ఎదిగేలా చేసింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణలో రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

Ram Narayana

కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

Leave a Comment